MODI 3.0 | మోదీ క్యాబినెట్‌లో యువ ఎంపీలు చిరాగ్ పాశ్వాన్, అన్నామలై.. !
Narendra Modi oath-taking ceremony | న్యూఢిల్లీ: బీహార్‌లో ఎన్‌డిఎ (NDA) కూటమిలో భాగంగా పోటీ చేసిన మొత్తం ఐదుకు ఐదు లోక్‌సభ స్థానాలను గెలుచుకుని అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న యువ నేత, ఎల్‌జెపి (రామ్ విలాస్) పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ (chirag paswan) , మూడవ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టనున్నారు.
ఈ సాయంత్రం ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి ముందు పాశ్వాన్‌కు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నుంచి కాల్ వచ్చినట్లు తెలిసింది.మొదటి, రెండవ విడత నరేంద్ర మోదీ (Modi) ప్రభుత్వాలలో సైతం మంత్రివర్గంలో చిరాగ్ పాశ్వాన్‌కు చోటు దక్కింది. పాశ్వాన్ బీహార్‌లోని హాజీపూర్ స్థానం నుంచి ఎన్నికయ్యారు, ఆయన తండ్రి రికార్డుస్థాయిలో 9 సార్లు ఎంపీగా గెలుపొందారు. రాజకీయాల్లో తన తండ్రి బాటలో నడిచిన చిరాగ్ పాశ్వాన్.. తన ప్రయాణంలో ఈ ఎన్నికలు కీలక మైలురాయిగా నిలిచాయి. ఎల్‌జేపీ లో చిరాగ్...