Saturday, August 30Thank you for visiting

Tag: Andhra Pradesh

AP Budget 2024 | ఏపీ బడ్జెట్..  శాఖల వారీగా కేటాయింపులు ఇవి :

AP Budget 2024 | ఏపీ బడ్జెట్.. శాఖల వారీగా కేటాయింపులు ఇవి :

Andhrapradesh
Andhra Pradesh Budget 2024-25: ఏపీ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2024-25 సంవత్సరానికి గానూ రూ.2.94 లక్షల కోట్ల ప్రతిపాదనతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపగా.. సోమవారం ఉదయం ప్రారంభమైందిన అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ స్వరూపం ఇదీ..వార్షిక బడ్జెట్ : రూ. 2.94. లక్షల కోట్లు వ్యవసాయ బడ్జెట్ : రూ. 43,402.33 కోట్లు రెవెన్యూ వ్యయం అంచనా : రూ.2.34 లక్షల కోట్లు. మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు. రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు. ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు. జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం. జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు అంచనా 2.12 శాతం.శాఖల వారీగా పూర్తి కేటాయింపులివే..రూ. 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్. రూ. 4,3...
Amaravati Railway line | అమరావతి రైల్వే లైన్‌కు ప‌చ్చ‌జెండా.. కేంద్ర మంత్రివర్గం ఆమోదం

Amaravati Railway line | అమరావతి రైల్వే లైన్‌కు ప‌చ్చ‌జెండా.. కేంద్ర మంత్రివర్గం ఆమోదం

Andhrapradesh
Amaravati Railway line : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, బీహార్‌ రాష్ట్రాల్లోని పలు కీలక ప్రాంతాలను కలుపుతూ మొత్తం రూ.6,798 కోట్లతో రెండు రైలు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. బీహార్‌లోని నార్కతియాగంజ్-రక్సాల్-సీతామర్హి-దర్భంగా రైల్వే లైన్ డ‌బ్లింగ్‌, సీతామర్హి-ముజఫర్‌పూర్ సెక్షన్లలో 256 కి.మీ మేర డబ్లింగ్ తోపాటు అమరావతి మీదుగా ఎర్రుపాలెం-నంబూరు మధ్య కొత్త లైన్‌ను నిర్మించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. కీలక ప్రాంతాల్లో కొత్తగా రైలు కనెక్టివిటీ ఈ రెండు ప్రాజెక్టులు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాలకు రైల్వే క‌నెక్టివిటీని అందిస్తాయి. ముఖ్యంగా నర్కతియాగంజ్-రక్సాల్-సీతామర్హి-దర్భంగా రైల్వేలైన్‌, సీతామర్హి-ముజఫర్‌పూర్ రైల్వే లైన్ల‌ డ‌బ్లింగ్ పూర్తియితే నేపాల్, ఈశాన్య భారతదేశ సరిహద్దు ...
Mega DSC 2024 : మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలయ్యేది ఈ తేదీలోనే !

Mega DSC 2024 : మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలయ్యేది ఈ తేదీలోనే !

Career
Mega DSC 2024 : మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ కోసం ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వం కూడా త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు నవంబరు మొదటి వారంలో మెగా డీఎస్సీని ప్ర‌క‌టించే చాన్స్ ఉంది. న్యాయప‌ర‌మైన చిక్కులు లేకుండా నోటిఫికేషన్ .జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ డీఎస్సీ ప్రకటన ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇటీవల జరిగిన ‘టెట్‌’ పరీక్షల ఫలితాలు నవంబరు 2న విడుదల చేయ‌నున్నారు. విభాగాల వారీగా చూస్తూ పోస్టుల వివ‌రాలు ఇలా ఉన్నాయి.సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (SGT) పోస్టులు 6,371 స్కూల్‌ అసిస్టెంట్లు (SA) పోస్టులు 7,725 ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్ (TGT) పోస్టులు 1781 పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్ (PGT) పోస్టులు 286 వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు (PET) 132 ప్రిన్సి...
AP Cyclone Alert | ముంచుకొస్తున్న ముప్పు.. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

AP Cyclone Alert | ముంచుకొస్తున్న ముప్పు.. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

Andhrapradesh
AP Cyclone Alert | ఏపీకి మళ్లీ వర్షాల ముప్పు ముంచుకొస్తోంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చి మ వాయువ్య దిశగా పయనిస్తూ బ‌ల‌ప‌డి తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడుకు తూర్పు–ఆగ్నేయంగా 490 కిలోమీట‌ర్లు, పుదుచ్చేరికి తూర్పు–ఆగ్నేయంగా 500 కిలోమీట‌ర్లు నెల్లూరుకు ఆగ్నేయంగా 590 కి.మీ.దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది ఈ నెల 17న తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పశ్చిమ–వాయువ్య దిశగా ప‌య‌నించి ఉత్తర తమిళనాడు–దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరాలను పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశముంద‌ని వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. దీని కార‌ణంగా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో రానున్న మూడు రోజులు ఈ మూడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ...
Tirupati Laddu | తిరుమల లడ్డూల కల్తీ నెయ్యి వ్యవహారంలో కేంద్రం సీరియస్‌..

Tirupati Laddu | తిరుమల లడ్డూల కల్తీ నెయ్యి వ్యవహారంలో కేంద్రం సీరియస్‌..

Andhrapradesh
Tirupati Laddu Row | కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంపై కేంద్రం సీరియ‌స్ అయింది. ఆల‌యానికి నెయ్యి సరఫరా చేసిన కంపెనీకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం నోటీసులు జారీ చేసింది. స‌ద‌రు కంపెనీ స‌ర‌ఫ‌రా చేసిన‌ నెయ్యి నాణ్యత పరీక్షల్లో విఫలం కావడంతో షోకాజ్‌ నోటీసులిచ్చింది. నాలుగు కంపెనీల నుంచి నెయ్యి నమూనాలను కేంద్రం సేకరించి ల్యాబ్‌కు పంపించ‌గా అందులో ఓ కంపెనీ నాణ్యత పరీక్షల్లో ఫెయిల్‌ కావడంతో కేంద్రం చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. అయితే, తమిళనాడులో ఏఆర్‌ డెయిరీకి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు. ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్య‌వ‌హారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.గత ప్రభుత్వ హయాంలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వులు ఉన్నాయని ల్యాబ్ రిపోర్ట్‌...
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై  రంగంలోకి దిగిన కేంద్రం..

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రంగంలోకి దిగిన కేంద్రం..

Andhrapradesh
Tirupati Laddu Row : ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి దేవస్థానంలో లడ్డూలను కల్తీ చేశారన్న వివాదం శుక్రవారం (సెప్టెంబర్ 20) మరింత ముదిరి పాకాన ప‌డింది. ఈ వ్య‌వ‌హారంపై స‌మ‌గ్ర‌ నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇండియా టుడే కథనం ప్రకారం.. తాము నిర్వహించిన ఐదు పరీక్షల్లో పంది కొవ్వు, బీఫ్ ఫ్యాట్, పామాయిల్ తదితరాలను ఉప‌యోగించిన‌ట్లు తేలిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. దీంతో పాటు లడ్డూల నాణ్యత నాసిర‌కంగా మారింన్నారు.ఇదిలా ఉండ‌గా, చంద్రబాబు నాయుడు టీడీపీ దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నార‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉండగా లడ్డూల్లో కల్తీ జరుగుతోందన్న ఆరోపణలను కొట్టిపారేశారు. టీడీపీ పంచుకున్న ల్యాబ్ రిపోర్టు జూలై నాటిదని, అది నయీం హయాంలోనిదని జ‌గ‌న్‌ పేర్కొన్నారు.కల్తీని అంగీకరించిన టీటీడీకాగా తిరుమల...
AP Heavy Rains | ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు..

AP Heavy Rains | ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు..

Andhrapradesh
AP Floods | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర‌రూపం దాల్చుతోంది. దీని కార‌ణంగా సోమవారం నాటికి ఒడిసా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో ఇది వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చ‌రించింది. దీంతో ఒడిశాలోని పలు ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం (సెప్టెంబర్ 8) రోజున ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం తెలుపుతూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత భారీ వర్షాలు (AP Floods) కురిసే చాన్స్ ఉంద‌ని రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన బులెటిన్‌లో తెలిపింది.సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాలు, యానాం, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్‌ ఉందని వాతావరణ శాఖ వెల్ల‌డించింది. తూర్పుగోదావర...
Trains Cancelled | ప్రయాణికులకు గ‌మ‌నిక‌.. నేడు మరో 20 రైళ్లు రద్దు

Trains Cancelled | ప్రయాణికులకు గ‌మ‌నిక‌.. నేడు మరో 20 రైళ్లు రద్దు

Trending News
Trains Cancelled |  తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కార‌ణంగా రైల్వే శాఖ ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసింది. వ‌ర్ష బీభత్సానికి వాగులు, న‌దులు ఉధృతంగా ప్ర‌వ‌హించ‌డంతో రైల్వే ట్రాక్‌లు కొన్ని చోట్ల కొట్టుకుపోయాయి. మహబూబాబాద్‌ జిల్లాలో ఏకంగా ట్రాక్‌ కింద మట్టి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ట్రాక్‌ పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే దక్షిణ మధ్య రైల్వే (SCR) ఇప్పటివరకు 500కుపైగా రైళ్లను క్యాన్సిల్ చేసిన విష‌యం తెలిసిందే.. మరో 160 రైళ్లను దారిమళ్లించ‌గా మంగళవారం మరో 20 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటిలో హౌరా-బెంగళూరు ఎక్స్ ప్రెస్‌, హౌరా-పాడిచ్చేరి, హౌరా-చెన్నై, షాలిమార్‌- త్రివేండ్రం, ఎర్నాకులం-హాతియా, జైపూర్‌-కోయంబత్తూరు, ఢిల్లీ-విశాఖ, దన్‌బాద్‌-కోయంబత్తూరు, హాతియా-బెంగళూరు రైళ్లను నిర‌వ‌ధికంగా రద్దు చేశారు. తెలుగు రాష్ట్రాల‌కు సాయం అందిస్తామ‌ని మోదీ ...
Ration card Holders|  పేదలకు గుడ్ న్యూస్.. రేషన్ కార్డుపై చక్కర పంపిణీ

Ration card Holders| పేదలకు గుడ్ న్యూస్.. రేషన్ కార్డుపై చక్కర పంపిణీ

Andhrapradesh
Ration card Holders | రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబరు నుంచి బియ్యంతో పాటు చక్కెర పంపిణీ చేయాలని నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి సారించింది. సరుకుల సరఫరాలో అనేక అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించింది. ఈ కారణంతోనే రెండు నెలలుగా చక్కెర పంపిణీ నిలిపివేసింది. సెప్టెంబరు నుంచి కొత్త ప్యాకింగులో పంచదార పంపిణీకి రంగం సిద్ధం చేసింది.గత వైఎస్ఆర్సిపీ ప్రభుత్వం నిత్యవసరాలను తగ్గించి చివరకు కేవలం బియ్యానికే పరిమితం చేసింది. అందరికి అవసరమైన కందిపప్పును పూర్తిగా నిలిపివేసింది. మూడునెలల కిందట అదికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం కార్డుదారులకు సరకుల సరఫరాపై జిల్లాల వారీగా లబ్ధిదారులు, డీలర్లు, ఎండీయూ వాహనదారులతో సర్వే నిర్వహించింది.  కార్డుదారుల్లో ఒక్కొక్కరికి 5 కిలోల వంతున ఉచిత బియ్యం, నగదుకు అరకిలో చక్కెర ఇవ్వనున్నారు. వచ్చేనెల నుంచి కొత్త...
Indian Railways | విశాఖపట్నం – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కు ఈ స్టేష‌న్ లో హాల్టింగ్‌

Indian Railways | విశాఖపట్నం – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కు ఈ స్టేష‌న్ లో హాల్టింగ్‌

Andhrapradesh
Vande Bharat Express | ఏలూరు ప్రజలకు భార‌తీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో రోజులుగా ఏలూరు రైల్వేస్టేషన్ (Eluru Station)లో వందే భారత్ రైలును నిల‌పాల‌ని డిమాండ్ వ‌స్తోదంఇ. ఈ క్ర‌మంలోనే ఎంపీ పుట్టా మహేశ్ స్పందించి ఆగస్టు 25 నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఏలూరులో నిలిపేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య తిరిగే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఏలూరు రైల్వేస్టేష‌న్‌ లో ఒక నిమిషం పాటు ఆగనుంది.విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభార‌త్ ఎక్స్ ప్రెస్‌.. ఆగస్టు 25న మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు బయలుదేరి ఏలూరుకి 5 గంటల 54 నిమిషాలకు చేరుకోనుంది. ఏలూరు రైల్వేస్టేషన్ నుంచి 5 గంటల 55 నిమిషాలకు సికింద్రాబాద్ స్టేష‌న్ కు చేరుకుంటుంది. ఆ మరుసటి రోజు నుంచి సికింద్రాబాద్ నుంచి వెళ్లే వందేభార‌త్‌ రైలు... విశాఖపట్నం నుంచి వచ్చే రైలు ఏలూరులో నిలుస్తాయి. ఏలూరులో హాల్టింగ్ సౌక‌ర్యం క‌ల్పించినందు...