BIS raids | అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ గిడ్డంగులపై బిఐఎస్ దాడులు.. 10,000 కి పైగా గుర్తింపులేని వస్తువులు స్వాధీనం
BIS raids Amazon, Flipkart warehouses | ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల వివిధ గిడ్డంగుల(warehouses )పై ఇటీవల జరిపిన దాడుల్లో తప్పనిసరి ధ్రవీకరణ లేని అనేక వస్తువులను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) కనుగొన్నట్లు భారత జాతీయ ప్రమాణాల సంస్థ బుధవారం 'X' పోస్ట్‌లో తెలిపింది.ప్రమాదకరమైన ఉత్పత్తుల నుంచి వినియోగదారులను రక్షించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు BIS తెలిపింది. గుర్గావ్, లక్నో, ఢిల్లీలోని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ గోదాములలో నిర్వహించిన వరుస దాడుల్లో, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (Bureau of Indian Standards) చట్టం, 2016లోని సెక్షన్ 17ని ఉల్లంఘించి BIS స్టాండర్డ్ మార్క్ లేకుండా ఉన్న ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు, బొమ్మలు, బ్లెండర్లు, బాటిళ్లు, స్పీకర్లతో సహా 7,000 కంటే ఎక్కువ నాణ్యత లేని వస్తువులను స్వాధీనం చేసుకుంది."ఈ నాసిరకం వస్తువులను స్వాధీనం చేసుకోవడ...