Pune Airport : సంత్ తుకారాం ఎవరు? పూణె విమానాశ్రయానికి ఆయనపేరు ఎందుకు పెడుతున్నారు..?
Pune Airport : పూణె విమానాశ్రయం పేరును జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ విమానాశ్రయంగా మార్చే ప్రతిపాదనకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన ఇప్పుడు తుది ఆమోదం కోసం కేంద్రానికి పంపించనున్నారు. అంతకుముందు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరు మార్పుకు తన మద్దతు తెలిపారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెస్తుందని హామీ ఇచ్చారు.విమానాశ్రయానికి 'జగద్గురు సంత్‌శ్రేష్ఠ తుకారాం మహారాజ్ పూణే అంతర్జాతీయ విమానాశ్రయం (Jagadguru Sant Tukaram Maharaj International Airport గా పేరు మార్చే దిశగా ఈరోజు తొలి అడుగు వేశామని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ప్రకటించారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించిందని ఆయన తెలిపారు. "జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ పూణే అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న లోహెగావ్‌ల...