
Sridevi Sharannavarathrotsavam | గ్రేటర్ వరంగల్ పరిధిలోని 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ప్రసిద్ధ శ్రీ నిమిషాంబ దేవి (Nimishamba Devi) అమ్మవారి ఆలయంలో అక్టోబర్ 3 గురువారం నుంచి 12వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రోత్సవాలను నిర్వహించనున్నారు.
మొదటి రోజు 03-10-2024 గురువారం ఉదయం 6-00 గంటలకు గణపతిపూజ, పుణ్యాహావచనం, అంకురార్పణ, అభిషేకం, రక్షాబంధనం, కలశస్థాపనం, అఖండదీపం కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ తెలిపింది.
అలాగే 03-10-2024 నుంచి 12-10-2023 విజయదశమి రోజు వరకు అమ్మవారు ఒక్కొక్క అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. విజయదశమి శనివారం రోజు ఉదయం అమ్మవారిని అభిషేకించి, కలశ ఉద్వాసన, పూర్ణాహుతి చేసిన తదుపరి అమ్మవారికి విశేషపూజలు అర్చనలు, మంగళరతులు, తీర్థప్రసాద వితరణ ఉంటుంది. సాయంత్రం 5-00 గంటలకు జమ్మిపూజ నిర్వహించనున్నారు. రాత్రి 9-00 గంటలకు కుంభ బలి, కూష్మాండబలి ఇచ్చి ధ్వజపట అవరోహణతో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వరిసమాప్తమవుతాయని ఆలయ కమిటీ పేర్కొంది. ప్రతి రోజు ఉదయం 9-00 గంటలకు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అభిషేకం, అష్టోత్తర పూజలు, అర్చనలు సాయంత్రం వేదపారాయణం, మంగళహారతులు, కాగా ప్రతీ రోజు ఉదయం 10గంటలకు చండీహోమం నిర్వహించనున్నారు.
- 03-10-2024 గురువారం బాలత్రిపుర సుందరిదేవి అవతారం
- 04-10-2024 శుక్రవారం గాయత్రీదేవి అవతారం
- 05-10-2024 శనివారం అన్నపూర్ణ దేవి అవతారం
- 06-10-2024 ఆదివారం శ్రీ మహాలక్ష్మి దేవి అవతారం
- 07-10-2024 సోమవారం శ్రీ చండీ దేవి అవతారం
- 08-10-2024 మంగళవారం శ్రీ సరస్వతిదేవి అవతారం
- 09-10-2024 బుధవారం శ్రీ లలితత్రిపుర సుందరి దేవి అవతారం
- 10-10-2024 గురువారం దుర్గాదేవి అవతారం.
- 11-10-2024 శుక్రవారం శ్రీ మహిషాసురమర్ధిని అవతారం
- 12-10-2024 శనివారం శ్రీ నిమిషాంబ దేవి/ రాజరాజేశ్వరీదేవి అవతారం
నిమిషాంబదేవి ఆలయంలో శరన్నవరాత్రి (Sridevi Sharannavarathrotsavam) ఉత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలకు ఆలయ అర్చకులు సౌమిత్రి కళ్యాణ్ ఆచార్యులు (7569494938) అలాగే ఆలయ కమిటీ ప్రతినిధులు 7702401936, 8106346086 ຜ 9346877937, 9866135004, 8328525281, 939991307 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..