Friday, January 23Thank you for visiting

Special Stories

Special stories and Exclusive stories

Inavolu Mallanna | ఐలోని మల్లన్న బ్రహ్మోత్సవాలకు వేళాయే.. జానపదుల జాతర విశేషాలు తెలుసా.. ?

Inavolu Mallanna | ఐలోని మల్లన్న బ్రహ్మోత్సవాలకు వేళాయే.. జానపదుల జాతర విశేషాలు తెలుసా.. ?

Special Stories
Inavolu Mallanna Swamy Temple: కాకతీయుల కళా వైభవం ఉట్టిపడే మహిమాన్విత క్షేత్రం ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం.. భక్తులు కోరిన వెంటనే కోర్కెలు తీర్చే కొంగుబంగారం, గొల్ల కురుమలు, ఒగ్గు కళాకారుల ఆరాధ్య దైవ్యంగా పూజలందుకుంటున్న ఐలోని మల్లన్న పుణ్యక్షేత్రం స్వామివారి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. జాన పదుల జాతరగా పిలిచే ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు ఈనెల 13 నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానుండగా.. సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ ఉత్సవాలకు సమీప జిల్లాలతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మల్లన్న స్వామిని దర్శించుకుంటారు. మరికొద్ది రోజుల్లోనే ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఐలోని మల్లన్న ఆలయ విశిష్టత గురించి మీరూ తెలుసుకోండి..ఆలయ చరిత్ర ఐనవోలు పుణ్యక్షేత్రాన్ని కాకతీయులు నిర్మించారనే పలువురు చెబుతుండగా చాళుక్యుల కాలంలోనే నిర్మించారని చారిత్రక ఆధారాలు సూ...
Kisan Credit Cards : పావలా వడ్డీకే రుణాలు అందించే కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ గురించి మీకు తెలుసా? పూర్తి వివరాలు ఇవే..

Kisan Credit Cards : పావలా వడ్డీకే రుణాలు అందించే కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ గురించి మీకు తెలుసా? పూర్తి వివరాలు ఇవే..

Special Stories
Kisan Credit Card Details: బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులతో పోలిస్తే, కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు (KCC) కాస్త భిన్నవైనవి. కేవలం రైతుల కోసం మాత్రమే ఉద్దేశించిన రుణ పథకం ఇది. వ్యవసాయ రంగం, రైతులకు అవసరమైన షార్ట్‌ టర్మ్‌ రుణాల కోసం, 1998లో నాబార్డ్‌ (NABARD) ఈ క్రెడిట్‌ కార్డులను ప్రవేశపెట్టింది. వీటిని ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్ లు, కోపరేటివ్‌ బ్యాంక్ లు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ లు అందిస్తాయి. ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు (Pradhan Mantri Kisan Samman Nidhi Yojana) లింక్ చేశారు.. కాబట్టి ఆ కార్డులను PM కిసాన్ క్రెడిట్ కార్డ్ లు అని కూడా పిలుస్తారు. కేసీసీల్లో కొంత రుణ పరిమితి (KCC Credit Limit) ఉంటుంది. ఆ మొత్తంతోనే వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేయడం పాటు, ఇతర ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా, కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్ తో కేవలం పావలా వడ్డీతో...
Ram Mandir specialities | ఔరా అనిపించే ప్రత్యేకతలు.. అయోధ్య రామాలయం గురించి విశేషాలు ఇవే..

Ram Mandir specialities | ఔరా అనిపించే ప్రత్యేకతలు.. అయోధ్య రామాలయం గురించి విశేషాలు ఇవే..

Special Stories
Ayodhya Ram Mandir | యావత్ భారతదేశం అమిత ఆసక్తితో ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్‌ లోని అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమవుతోంది. జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. పది రోజుల పాటు నిర్వహించనున్న ప్రతిష్ఠాపనోత్సవాలు జనవరి 16వ తేదీన ప్రారంభమవుతాయి. ఆలయ గర్భగుడిలో రాముడి విగ్రహ ప్రతిష్ఠను 22న మధ్యాహ్నం 12.45-1.00 గంటల మధ్య నిర్వహించనున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఆలయ నిర్మాణం, విశేషాల గురించి తెలుసుకునేందుకు ప్రతీ ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఇంటర్నెట్ లో వెతుకుతున్నారు. ఈ క్రమంలో అయోధ్యలోని భవ్య రామ మందిర ప్రత్యేకతలు గురించి ఒకసారి చూడండి.. ఆలయ ప్రత్యేకతలు (Ram Mandir specialities)భారత సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు ప్రతిరూపం అయోధ్య రామ మంది...
solar systems | ఇంటిపై సోలార్ పెట్టుకుంటే ప్రభుత్వం సబ్సిడీ ఎంత? ఈఎంఐ సౌకర్యం ఉంటుందా..?

solar systems | ఇంటిపై సోలార్ పెట్టుకుంటే ప్రభుత్వం సబ్సిడీ ఎంత? ఈఎంఐ సౌకర్యం ఉంటుందా..?

Special Stories
solar systems: తెలంగాణ‌లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ రెడ్కో కృషి చేస్తోంది.   ఇంధ‌న పొదుపు వారోత్సవాల్లో భాగంగా. సోలార్ విద్యుత్ వల్ల క‌లిగే లాభాలు, ప్రభుత్వ స‌బ్సిడీల పై  ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తరచూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే.. సోలార్ విద్యుత్ కకోసం గృహాల‌కు అందిస్తున్న స‌బ్సిడీ ఎంత‌? మ‌హిళా సంఘాల‌కు ఏ విధ‌మైన స‌బ్సిడీ అంద‌జేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.సోలార్ రూఫ్ టాప్.. నెట్ మీటరింగ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు కోసం రెడ్కో వ్యక్తి గత గృహాలకు 40% సబ్సిడీ అంద‌జేస్తుంది. దీని వల్ల అధిక కరెంటు బిల్లుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అయితే.. సోలార్ పవర్ సిస్టం మనం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే క‌నీసం 100 చద‌ర‌పు అడుగుల రూఫ్ ఉండాలి.. సోలార్ ఏర్పాటు చేస్తే నిర్వహ‌ణకు ఇబ్బంది అవుతుంద‌నే ప్రచారం ఉంది. కానీ రెడ్‌కో ద్వారా అందించే సోలార్ ప్య...
Tantalum | సట్లెజ్‌లో కనిపించిన అరుదైన లోహం టాంటాలమ్ అంటే ఏమిటి?

Tantalum | సట్లెజ్‌లో కనిపించిన అరుదైన లోహం టాంటాలమ్ అంటే ఏమిటి?

Special Stories
టాంటాలమ్ అంటే ఏమిటి? ఇది ఎప్పుడు కనుగొన్నారు..దాని లక్షణాలు ఏమిటి? Tantalum : పంజాబ్‌లోని సట్లెజ్ నది ఇసుకలో అరుదైన లోహం టాంటాలమ్ ఉన్నట్లు రోపర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పరిశోధకుల బృందం కనుగొంది. ఇన్స్టిట్యూట్ సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రెస్మి సెబాస్టియన్ నేతృత్వంలోని బృందం ఈ ఆవిష్కరణను చేసింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లలో ఈ లోహాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఈ టాంటాలమ్ నిల్వలు గుర్తించడం పంజాబ్‌కు మాత్రమే కాకుండా భారతదేశానికి ఎంతో ముఖ్యమైనది. టాంటాలమ్ అంటే ఏమిటి? టాంటాలమ్ పరమాణు సంఖ్య 73 కలిగిన అరుదైన లోహం. ఇది బూడిద రంగులో ఉంటుది. ఇది బరువైనది, చాలా గట్టిది. ప్రస్తుతం వాడుకలో ఉన్న అత్యంత తుప్పు-నిరోధక లోహాలలో ఒకటి. ఇది అధిక తుప్పు నిరోధకతను కలిగి ఉంటుంది, ఎందుకంటే ఇది గాలిలో ఉంచినప్పుడు ఇది ఆ...
Safest Cars:  భారత్ లో అత్యంత సురక్షితమైన కార్లు ఇవే..

Safest Cars: భారత్ లో అత్యంత సురక్షితమైన కార్లు ఇవే..

Special Stories
Global NCAP క్రాష్ టెస్ట్‌లలో 5-స్టార్ సాధించిన SUVలు/ సెడాన్‌ లిస్ట్ ఇదే.. Global NCAP safest cars:  కార్ల వినియోగంపై ప్రజల్లో క్రమంగా అవగాహన పెరుగుతోంది. కారు భద్రతా ఫీచర్ల గురించి చాలా జాగ్రత్తగా ఉంటున్నారు.. ముందుగానే వాహనాల క్రాష్ రేటింగ్‌లను తెలుసుకొని ఓ అంచనాకు వచ్చి కార్లను కొనుగోలు చేస్తున్నారు.అయితే Global NCAP ప్రకారం 5-స్టార్ రేటింగ్‌ను సాధించిన ఏడు SUVలు/సెడాన్ కార్ల జాబితాను మీరు ఈ కథనంలో తెలుసుకోవచ్చు. టాటా మోటార్స్‌కు చెందిన హారియర్, సఫారీ, వోక్స్‌వ్యాగన్ నుంచి వచ్చిన వర్టస్, టైగన్, స్కోడా కంపెనీకి చెందిన స్లావియా, కుషాక్ .. అలాగే హ్యుందాయ్ వెర్నాకార్లు టాప్ క్రాష్ టెస్టింగ్ లో 5 స్టార్ రేటింగ్‌లు సాధించాయి.టాటా హారియర్ Tata Harrierటాటా మోటార్స్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (SUV), హారియర్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. 5-సీ...
Kottankulangara Sree Devi Temple : ఈ ఆలయంలో పూజలు చేసేందుకు మగవారు స్త్రీల దుస్తులను ధరిస్తారు.. విస్తుగొలిపే ఈ ఆచారం ఎక్కడో తెలుసా.. వివరాలు..

Kottankulangara Sree Devi Temple : ఈ ఆలయంలో పూజలు చేసేందుకు మగవారు స్త్రీల దుస్తులను ధరిస్తారు.. విస్తుగొలిపే ఈ ఆచారం ఎక్కడో తెలుసా.. వివరాలు..

Special Stories
భారత దేశం విభిన్నమైన సంప్రదాయాలకు, ఆచారాలకు నిలయం. ఒక్కో ప్రాంతంలో సంప్రదాయాలు నమ్మకాలు మరో ప్రాంతం వారికి విచిత్రంగా.. ఆసక్తికరంగా ఉంటాయి. కేరళలోని ఓ ఆలయంలో నిర్వహించే వేడుకలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కొల్లాం జిల్లా Kollam లోని కొట్టన్‌కులంగర శ్రీ దేవి ఆలయం వార్షిక "చమయవిళక్కు" పండుగ Chamayavilakku Festival ను నిర్వహిస్తారు. ఇక్కడి అమ్మవారు ఎంతో మహిమాన్వితమైనదని ప్రజలు నమ్ముతారు.ఇది మరెవ్వరికీ లేని వేడుక, ఇక్కడ పురుషులే మహిళల వేషధారణలో వచ్చి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు.కొట్టన్‌కులంగర శ్రీ దేవి ఆలయం Kottankulangara Sree Devi Temple లో చమయవిళక్కు ఉత్సవం మార్చిలో 19 రోజుల పాటు నిర్వహిస్తారు. చివరి రెండు రోజులలో మగవారు మెరిసే నగలు, అత్యంత అందంగా తమను తాము అలంకరించుకుంటారు. ఈ సమయంలో మగవారందరూ స్త్రీల మాదిరిగా తయారై పూజలు చేయడం ఇక్కడ ముచ్చటగొలుపుతుంది. వారు చీరలు కట్టుకుంటారు...
శత్రువులు కూడా కీర్తించిన స్వాతంత్ర్య సమరయోధుడు.. వీరపాండ్య కట్టబొమ్మన్..

శత్రువులు కూడా కీర్తించిన స్వాతంత్ర్య సమరయోధుడు.. వీరపాండ్య కట్టబొమ్మన్..

Special Stories
కట్టబొమ్మన్ ను ఎందుకు ఉరి తీశారు? తరతరాలుగా పోరాట స్ఫూర్తిని నింపిన వీరపాండ్య కట్టబొమ్మన్ జీవిత విశేషాలు ఇవీ.. veerapandiya kattabomman : బ్రిటీషు వారి నుంచి భారత జాతి విముక్తి కోసం జరిగిన తొలి తిరుగుబాటుగా భావించే 1857 సిపాయిల తిరుగుబాటు కంటే ముందే తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడినవారిలో వీరపాండ్య కట్టబొమ్మన్ ప్రముఖులు.. తమిళనాడులోని ఒక చిన్న పట్టణమైన పాంజాలకురిచ్చి పాలించిన రాజు వీరపాండ్య కట్టబొమ్మన్.. అంత చిన్న రాజ్యాన్ని చేజిక్కించుకునేందుకు కూడా బ్రిటిష్ ప్రభుత్వం చాలా యుద్ధాలే చే యాల్సి వచ్చింది.  1799 అక్టోబర్ 16న వీరపాండ్య కట్టబొమ్మన్‌ను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేయించి గయత్తర్‌లో ఉరి తీసింది.వీరపాండ్య కట్టబొమ్మన్ 18వ శతాబ్దం చివరిలో బ్రిటీషు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. ఆయన 1760లో తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని పంచలంకురిచి గ్రామ...
Siachen Glacier : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్దభూమి సియాచిన్ గ్లేసియర్ గురించి మీకు తెలియని వాస్తవాలు

Siachen Glacier : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్దభూమి సియాచిన్ గ్లేసియర్ గురించి మీకు తెలియని వాస్తవాలు

Special Stories
Siachen Glacier : సియాచిన్ గ్లేసియర్ హిమాలయాల్లోని కారకోరం శ్రేణి (Karakoram) లో ఉన్న ఒక హిమానీనదం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్దభూమి సియాచిన్‌ గుర్తింపు పొందింది. కారాకోరం పర్వత శ్రేణిలో ఇండో-పాక్ నియంత్రణ రేఖకు సమీపంలో ఇది ఉంటుంది. సియాచిన్ గ్లేసియర్ ఎంత చల్లగా ఉంది? భారతదేశంలో 5,400 మీటర్ల ఎత్తులో ఉండే అతిపెద్ద హిమానీనదం సియాచిన్ గ్లేసియర్.. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద హిమానీనదంగా ఉంది. ఇక్కడ తరచుగా మైనస్ 45 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంచు తుఫానులతో అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. రక్తం గడ్డకట్టుకొని పోయే చలితో పాటు కనీసం ఊపిరి తీసుకోవాడానికి కూడా వీలుండదు.. కాబట్టి ఇది మానవులకు ఏమాత్రం నివాసయోగ్యం కాదు.ఏప్రిల్ 1984లో భారత సైన్యం (Indian Army) హిమానీనదంపై ఆధీనంలోకి వచ్చినప్పటి నుంచి సియాచిన్‌ వద్ద రక్షణ విధుల్లో భాగంగా సుమారు వెయ్యి మంది సైనికులు ...
Israel Palestine conflict: ఇజ్రాయెల్ ఎలా పుట్టింది..? పాలస్తీనాతో వివాదం ఎందుకు? యూదుల వలస వెనుక చరిత్ర ఏమిటీ?

Israel Palestine conflict: ఇజ్రాయెల్ ఎలా పుట్టింది..? పాలస్తీనాతో వివాదం ఎందుకు? యూదుల వలస వెనుక చరిత్ర ఏమిటీ?

Special Stories
వందేళ్లుగా రగులుతున్నమారణహోమానికి కారణాలేంటీ...?Israel Palestine conflict : ఇజ్రాయెల్ - పాలస్తీనా వివాదం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, అలాగే నిర్విరామంగా ఇప్పటికీ కొనసాగుతున్న సంఘర్షణలలో ఒకటి. ఈ ప్రాంతంలో యుద్ధాలు, విధ్వంసం, రక్తపాతం కలిగించే ఘోరమైన ఘటనలు నిరంతరం చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం ఎలా మొదలైంది? పాలస్తీనా - ఇజ్రాయెల్ చరిత్ర ఏమిటి? పూర్తి వివరాలు ఈ కథనంలో చూడండి..ఇజ్రాయెల్ నేడు పశ్చిమాసియాలోని ఒక చిన్న దేశం. ఇది భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన మేఘాలయ లేదా మణిపూర్ పరిమాణంలో ఉంది. ఇజ్రాయెల్ కు పశ్చిమాన మధ్యధరా సముద్రం, దక్షిణాన ఈజిప్ట్, తూర్పున జోర్డాన్, సిరియా.. ఉత్తరాన లెబనాన్ సరిహద్దులుగా ఉంది. ఇజ్రాయెల్‌లో యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు మతపరమైన ప్రాముఖ్యత ఉన్న అనేక పవిత్రక్షేత్రాలు ఉన్నాయి నేడు, ఇజ్రాయెల్ జనాభాలో ఎక్కువగా యూదులు ఉన్నారు. మ...