Chenab Bridge : భారత నిర్మాణ చరిత్రలో అద్భుతం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జమ్మూ కాశ్మీర్‌ను సందర్శించి, ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గాన్ని ప్రారంభించారు. ఇది కాశ్మీర్ లోయను భారతదేశ జాతీయ రైల్వే వ్యవస్థలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించే అత్యంత కీలకమైన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన అయిన చీనాబ్ రైల్వే వంతెన (Chenab Bridge) ఉంది.శుక్రవారం ఉదయం 11 గంటలకు దీనిని ప్రధాన మంత్రి మోదీ ప్రారంభించారు.చీనాబ్ వంతెన అంటే ఏమిటి?చీనాబ్ నదికి 359 మీటర్ల ఎత్తులో నిర్మించి ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన. ఇది ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు ఉంటుంది. దిల్లీలోని కుతుబ్ మినార్ కంటే నదీ గర్భం నుంచి రైలు స్థాయి వరకు దాదాపు ఐదు రెట్లు ఎత్తుగా ఉంటుంది. ఈ వంతెన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ద్వారా కాట్రా, శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని సుమారు 3 గంటలకు తగ్గిస్తుంది.Chenab Bridge విశేషాలుఎత్...