విషాదం : రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

విషాదం : రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌ వేపై ఘజియాబాద్‌లోని క్రాసింగ్ రిపబ్లిక్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. రహదారిపై రాంగ్ రూట్ లో వస్తున్న స్కూల్ బస్సును కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరంతా మీరట్‌లో నివాసం ఉంటున్నారు.
ఎస్‌యూవీలో ఉన్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డుపై రాంగ్ సైడ్ లో నడుపుతున్న స్కూల్ బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతనిని విచారిస్తున్నామని, కఠినమైన సెక్షన్లతో కేసు నమోదు చేస్తున్నామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ దేహత్ శుభమ్ పటేల్ చెప్పారు.  ” వాహనాలు ఢీకొన్న ప్రభావం చాలా బలంగా ఉంది, కారు తలుపులను  కత్తిరించి మృతదేహాలను బయటకు తీశారు” అని తెలిపారు.

READ MORE  ఘజియాబాద్ బాలిక ఆత్మహత్య.. అన్నయ్య డ్రగ్స్ మానేయాలని సుసైడ్ నోట్

“ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై స్కూల్ బస్సు SUV కారు ఢీకొట్టింది. బస్సు ఢిల్లీ వైపు వెళుతోంది. ఢిల్లీలోని ఘాజీపూర్ నుండి CNG నింపి రాంగ్ సైడ్ నుండి వస్తున్నాడు. SUVలో ఉన్నవారు మీరట్ నుండి వస్తున్నారు. వారు గుర్గావ్‌కు వెళ్తున్నారు” అని ట్రాఫిక్ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామానంద్ కుష్వాహా తెలిపారు.

“ఈ రెండు వాహనాలు మధ్య ఢీకొనడంతో కారులో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు, వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు” అని కుష్వాహా తెలిపారు. మీరట్‌లోని ఇంచోలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కుటుంబం నివసిస్తోందని అధికారి తెలిపారు. “కారులో పిల్లలు, మహిళలు, పురుషులు ఉన్నారు. అందరూ కుటుంబ సభ్యులే. కారులో మొత్తం ఎనిమిది మంది కూర్చున్నారు. ఈ బస్సు నోయిడాలోని బాల్ భారతి స్కూల్‌కు చెందినది” అని ఆయన చెప్పారు.

READ MORE  యువతితో బలవంతంగా బీఫ్‌ తినిపించి సామూహిక అత్యాచారం.. ఆపై వీడియో తీసి కాబోయే భర్తకు పంపారు..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *