Simala Prasad యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించిన ఐపీఎస్ అధికారిణి…బాలీవుడ్ సినిమాల్లో నటించి,
Simala Prasad | ఖాకీ యూనిఫాం ధరించిన ఓ ఉన్నత స్థాయి పోలీసు అధికారికి సినిమాలో పనిచేయడం పెద్ద సవాల్.. అయితే ఐపీఎస్ అధికారి సిమల ప్రసాద్ ఆ పని చేశారు. ఒక వైపు, నేరస్థులు ఆమె పేరుకు భయపడతారు, మరోవైపు ఆమె అనేక బాలీవుడ్ చిత్రాలలో తన అందం, అభినయంతో అందరినీ మైమరపించారు. ఆమె నటించిన, ఆస్పిరెంట్ అనే వెబ్ సిరీస్ కూడా ఎంతో సక్సెస్ అయింది. ఇందులో UPSC కోసం సిద్ధమవుతున్న ముగ్గురు స్నేహితుల కథ చూపించారు. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించిన అలాంటి కొందరి కథలను ఈ సందర్భంగా మీకు అందిస్తున్నాం..
భారతదేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలలో తొలి ప్రయత్నంలోనే ర్యాంక్ సాధించారు. వ్యక్తి సిమల ప్రసాద్.. అమె 2010 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి. అయితే, ఐఏఎస్ సాధించడానికి ముందు, సిమల ప్రసాద్ కి చిన్నప్పటి నుంచి డ్యాన్స్, యాక్టింగ్ అంటే ఇష్టం. స్కూల్లో కూడా డ్యాన్స్‌లో, యాక్టింగ్‌లో ఎప్పుడూ ముందుండేది. స్కూలు, కాలేజీల్లో ఎన్నో నాటకాల్లో పనిచేశారు.
సిమల ప్రసాద్ 1980 అక్టోబర్ 8న భోపాల్‌లో జన్మించారు..ఇక్కడే చదువుకున్నారు. సిమల ప్రాథమిక విద్యాభ్యాసం సెయింట్ జోసెఫ్ కోయెడ్ స్కూల్‌లో సాగింది. దీని తరువాత, స్టూడెంట్ ఫర్ ఎక్సలెన్స్ నుండి B.Com, BU నుండి PG పూర్తి చేసి PSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. భోపాల్‌లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం నుండి సోషియాలజీలో పీజీ చేసిన సిమల ప్రసాద్ బంగారు పతక విజేతగా నిలిచారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, PSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, సిమల ప్రసాద్ మొదటి పోస్టింగ్ DSPగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఉద్యోగం చేస్తూనే ఆమె UPSC పరీక్షకు సిద్ధమయ్యారు. అయితే మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. సిమల ఐపీఎస్ కావడానికి ఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ సహాయం తీసుకోలేదు, స్వీయ అధ్యయనం ద్వారా ఈ స్థానం సాధించించారు. సివిల్ సర్వీస్‌లో చేరాలని తానెప్పుడూ అనుకోలేదని, అయితే ఇంట్లోని వాతావరణమే ఐపీఎస్ కావాలనే కోరికను నాలో రేకెత్తించిందని ఆమె చెప్పారు. దేశానికి సేవ చేసేందుకు ఇంతకంటే మంచి వేదిక ఉండదని భావించానని సిమల తెలిపారు.
బాలివుడ్ లోనూ సక్సెస్..
Simala Prasad తన జీవితంలో నటి కావాలనే తన కలను కూడా నెరవేర్చుకున్నారు. ఆమె అలీఫ్ (2016), నక్కాష్ (2019) వంటి బాలీవుడ్ చిత్రాలలో చక్కని అభినయంతో అందరినీ మెప్పించారు.ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో దర్శకుడు జైఘం ఇమామ్ సిమల ప్రసాద్‌ను కలిశారు. సిమల సింప్లిసిటీ, అందం చూసి, జైఘం ఆమె అపాయింట్‌మెంట్ అడిగారు అతని చిత్రం ‘అలీఫ్స స్క్రిప్ట్‌ను వివరించిన తర్వాత, ఆమె వెంటనే ఆమెకు పాత్రను అంగీకరించారు. ఆ తర్వాత ‘అలీఫ్’ సినిమాతో సిమల సినీ రంగ ప్రవేశం చేశారు. నవంబర్ 2016లో ఆస్ట్రేలియాలో జరిగిన ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ క్వీన్స్‌లాండ్‌లో ఈ చిత్రం ప్రపంచ ప్రీమియర్‌ను ప్రదర్శించింది. ఫిబ్రవరి 2017లో విడుదలైంది. ఆ తర్వాత 2019లో విడుదలైన ‘నక్కష్’ చిత్రంలో జర్నలిస్టు పాత్రను పోషించారు
ఇక మరో ఆసక్తికర విషయమేంటంటే.. సిమల ప్రసాద్ కూడా ఐఏఎస్ అధికారుల కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. ఆమె తండ్రి డాక్టర్ భగీరథ్ ప్రసాద్ 1975 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. సీమలతల్లి మెహ్రున్నీసా పర్వేజ్ పద్మశ్రీ అవార్డు పొందిన సుప్రసిద్ధ సాహితీవేత్త.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
Nice