శ్వేతార్క గణపతి ఆలయంలో నేటి నుంచి శ్రావణ మాసోత్సవాలు

శ్వేతార్క గణపతి ఆలయంలో నేటి నుంచి  శ్రావణ మాసోత్సవాలు

Kazipet:  హన్మకొండ జిల్లా కాజీపేటలోని ప్రసిద్ధ శ్రీ శ్వేతార్క గణపతి ఆలయంలో శుక్రవారం నుంచి (ఆగస్టు 18 ) శ్రావణ మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈమేరకు ఆలయ కమిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఆగస్టు 18న సంతోషిమాతకు అభిషేకం, 19న శనివారం వేంకటేశ్వర స్వామివారికి పూజలు, అభిషేకాలు, 20న సంతాన నాగలింగేశ్వరస్వామికి అభిషేకం, 21న సోమవారం నాగేంద్రుడికి, 22న గాయత్రి అమ్మవారికి, 25న శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నారు. 26న శనివారం వేంకటేశ్వరస్వామివారికి ప్రత్యేక పూజలు, అలాగే సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణం, 27న ఆదివారం ఉదయం లక్ష్మీ నారాయణ హోమం, 31న గురువారం సాయంత్రం రక్షా బంధన్ విశేష పూజలు జరగనున్నాయి.
సెప్టెంబర్ 2న శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ప్రత్యే క పూజలు, సెప్టెంబర్ 3న సంకటహర చతుర్థి, శ్వేతార్కమూల గణపతి స్వామివారికి గంధం మరియు పుష్పాభిషేకం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 6న బుధవారం కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు
సెప్టెంబరు 7న శ్రీ కృష్ణుభగవానుడికి ప్రత్యేక పూజలు గణపతి అర్ధ మండల దీక్ష ప్రారంభం
సెప్టెంబరు 8న శుక్రవారం వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
సెప్టెంబరు 10న వెంకటేశ్వరస్వామికి శత కలశాభిషేకం, 16 రోజుల గణపతి దీక్ష ప్రారంభం
సెప్టెంబరు 14న గురువారం నాగదండ పూజలు జరపనున్నట్లు దేవాలయ కమిటీ పేర్కొంది.
కాగా శ్రావణ మాసోత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం శ్రావణమాస ఇన్చార్జి పుల్యాల అరుణ్ (9908629558)ను సంప్రదించవచ్చు.

READ MORE  15 నుంచి నిమిషాంబా అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

గణపతి దీక్షల వివరాలు ఇవీ

42 రోజుల మండల దీక్ష ఆగస్టు 18న
21 అర్ధమండల దీక్ష సెప్టెంబరు 7న
16రోజుల షోడశ దీక్ష సెప్టెంబరు 12న
11 రోజుల ఏకాదశి దీక్ష సెప్టెంబరు 17వ తేదీన ఉంటుంది.
గణేశముడి ,దీక్ష విరమణ సెప్టెంబరు 28 జరుగుతుంది.


Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

READ MORE  ఐదేళ్ల బాలుడిపై కుక్కల గుంపు దాడి..

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్, ఫేస్ బుక్  లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *