Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

గుడ్‌న్యూస్‌.. ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే..! – Special Trains Extended

Spread the love

SCR Special Trains Extended | ప్ర‌యాణికుల‌కు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. చర్లపల్లి-నర్సాపూర్‌-చర్లపల్లి, జాల్నా -తిరుపతి-జాల్నా మధ్య ప్రస్తుతం నడుస్తున్న రైళ్లను వొచ్చే సంవ‌త్స‌రం మార్చి నెలాఖరు వరకు పొడిగించింది. ఈమేర‌కు రైల్వే శాఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో వివ‌రాలు వెల్ల‌డించింది.

  • చర్లపల్లి-నర్సాపూర్‌ (07233) రైలు (Charlapalli to Narasapur Train) ప్రతి శనివారం సాయంత్రం 7.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు న‌ర్సాపూర్‌ చేరుకుంటుందని పేర్కొంది.
  • ఇక నర్సాపూర్‌-చర్లపల్లి (07234) రైలు ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు బయలుదేరి ఉదయం 7 గంటలకు చ‌ర్ల‌ప‌ల్లి చేరుకుంటుందని పేర్కొంది. Special Trains Extended
  • జాల్నా-తిరుపతి (07609) రైలు (Jalna to Tirupati Special Train) ప్రతి సోమవారం ఉదయం అందుబాటులో ఉంటుందని.. జాల్నా స్టేషన్‌లో ఉదయం 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు గ‌మ్య‌స్థానం చేరుతుందని చెప్పింది.
  • తిరుపతి-జాల్నా రైలు మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటలకు స్టార్ అయి మధ్యాహ్నం 3.50 గంటలకు జాల్నా చేరుతుందని తెలిపింది.

హాల్టింగ్ స్టేష‌న్స్ ఇవీ..

చర్లపల్లి-నర్సాపూర్‌-చర్లపల్లి రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్‌, విరసవరం, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుంది.

జాల్నా-తిరుపతి-జాల్నా రైలు పార్తూర్‌, సేలు, మన్వత్‌రోడ్‌, పర్బణి, గాంఖేర్‌, పర్లి వైద్యనాథ్‌, లాథూర్‌ రోడ్‌, ఉద్గిర్‌, బీదర్‌, మార్పల్లి, వికారాబాద్‌, లింగంపల్లి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చిరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గుడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

ఆయా రైళ్లలో సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ, స్లీపర్‌ క్లాస్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయని ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే పేర్కొంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *