Friday, April 18Welcome to Vandebhaarath

SCR Special Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్‌.. 60 ప్రత్యేక రైళ్లను పొడిగింపు ..వివ‌రాలు ఇవే..

Spread the love

SCR Special Trains | ప్ర‌యాణికుల‌కు దక్షిణ మధ్య రైల్వే తీపి క‌బురు చెప్పింది. ప్రస్తుతం వివిధ మార్గాల్లో నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను మ‌రికొంత కాలం పొడిగిస్తున్నట్లు వెల్ల‌డించింది. అక్టోబరు నుంచి డిసెంబర్‌ నెలాఖరు వరకు ఆయా ప్రత్యేక రైళ్లు య‌థావిథిగా న‌డిపించ‌నున్న‌ట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. రాబోయే దసరా, దీపావళి, ఛట్‌పూజ పండుల్లో ప్ర‌యాణికుల‌ రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్ర‌త్యేక‌ రైళ్లను పొడిగిస్తున్నట్లు వివ‌రించింది. పొడిగించిన ప్రత్యేక రైళ్లను ప్రయాణికులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరింది.

READ MORE  Telangana Districts | మళ్లీ జిల్లాల పునర్విభజన.. ఆ18 జిల్లాలు రద్దవుతాయా?

పొడిగించిన రైళ్లలో ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌ రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల మధ్య నడిచే సుదూర‌ రైళ్లు ఉన్నాయి. కింది రైళ్లు డిసెంబ‌ర్ వ‌ర‌కు న‌డుస్తాయి.

  • సికింద్రాబాద్‌-రామనాథపురం (07695),
  • రామనాథపురం-సికింద్రాబాద్‌ (07696),
  • కాచిగూడ – మధురై (07191),
  • మధురై – కాచిగూడ (07192),
  • కాచిగూడ – నాగర్‌కోయిల్‌ (07435),
  • నాగర్‌కోయిల్‌ – కాచిగూడ (07436),
  • కొల్లం – సికింద్రాబాద్‌ (07194)
  • సికింద్రాబాద్‌ – కొల్లం (07193),
  • తిరుపతి-అకోల,
  • అకోల-తిరుపతి,
  • సికింద్రాబాద్‌-తిరుపతి,
  • సికింద్రాబాద్‌ -దానాపూర్‌,
  • హైదరాబాద్‌ – జైపూర్‌,
  • హైదరాబాద్ – గోరక్‌పూర్‌,
  • సికింద్రాబాద్‌ – అగర్తలా,
  • సంత్రాగాచి-సికింద్రాబాద్‌,
  • షాలిమార్‌ – సికింద్రాబాద్‌,
  • తిరుపతి సికింద్రాబాద్‌,
  • తిరుపతి- షిర్డీ సాయినగర్‌,
  • తిరుపతి-కాచిగూడ,
  • కాచిగూడ – తిరుపతి,
  • కాకినాడ టౌన్‌ – లింగంపల్లి,
  • లింగంపల్లి-కాకినాడ టౌన్‌,
  • నర్సాపూర్‌-సికింద్రాబాద్,
  • మచిలీపట్నం – తిరుపతి,
  • హజ్రత్‌ నిజాముద్దీన్‌ – సికింద్రాబాద్‌తో పాటు పలుమార్గాల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని వివరించింది.
READ MORE  ప్ర‌యాణికుల‌కు TGSRTC గుడ్ న్యూస్‌.. హైదరాబాద్‌లో 70 కొత్త మెట్రో డీలక్స్ బస్సులు

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *