Samvidhaan Hatya Diwas | కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై ఏటా జూన్ 25న ‘సంవిధాన్ హత్యా దివస్’
New Delhi | 1975లో అప్పటి ప్రధాన మంత్రి మంత్రి ఇందిరా గాంధీ విధించిన ‘ఎమర్జెన్సీ’ కారణంగా అనేక కష్టాలు అనుభవించిన వారందరి కోసం ఏటా జూన్ 25 న ‘సంవిధాన్ హత్యా దివస్ ( Samvidhaan Hatya Diwas)’గా జరుపుకోవాలని బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా నిర్ణయించింది.
“జూన్ 25, 1975న, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, తన నియంతృత్వ ధోరణితో దేశంలో ఎమర్జెన్సీని విధించి భారత ప్రజాస్వామ్యం ఆత్మను ఉక్కిరిబిక్కిరి చేసారు” అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్స్(X)లో రాశారు. “భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 25ని ‘సంవిధాన్ హత్యా దివస్’గా జరుపుకోవాలని నిర్ణయించింది. 1975 ఎమర్జెన్సీ కాలంలో ప్రజల అమానవీయ బాధను, సహకారాన్ని ఈ రోజు మనకు గుర్తు చేస్తుంది, ”అన్నారాయన. ఏ తప్పు లేకుండా లక్షలాది మందిని కటకటాల వెనక్కి నెట్టారని, మీడియా గొంతు నొక్కారని అమిత్ షా అన్నారు. ‘సంవిధాన్ హత్యా దివస్’ పాటించడం వల్ల ప్రతి భారతీయుడిలో వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్య రక్షణపై నమ్మకం సజీవంగా ఉంటుందని, తద్వారా కాంగ్రెస్ వంటి “నియంతృత్వ శక్తులు” ” నాటి భయాందోళనలను” పునరావృతం కాకుండా నిరోధించవచ్చని ఆయన అన్నారు.
కాగా, ఇందిరా గాంధీ ప్రభుత్వం జూన్ 25, 1975న భారతదేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. దాదాపు రెండేళ్ల తర్వాత మార్చి 21, 1977న ఎమర్జెన్సీని ఎత్తివేయడంతో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడింది. జూన్ 25, 2024తో ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయ్యాయి. జూన్ 24న, కొత్త లోక్‌సభ తొలి సెషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజాస్వామ్యంలో ఇదొక మాయని మచ్చ అని వ్యాఖ్యానించారు.
కాగా కాంగ్రెస్ పార్టీనే పలుమార్లు రాజ్యాంగంలో సవరణలు తీసుకొచ్చిందని, కానీ ఆ పార్టీ నేతలు మాత్రం తాము రాజ్యాంగాన్నే మార్చేస్తామని దు ష్ప్రచారం చేస్తోందని, బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. రాజ్యాంగంపై గౌరవం లేని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రాజ్యాంగ ప్రతులతో నాటకాలాడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
On June 25, 1975, the then PM Indira Gandhi, in a brazen display of a dictatorial mindset, strangled the soul of our democracy by imposing the Emergency on the nation. Lakhs of people were thrown behind bars for no fault of their own, and the voice of the media was silenced.
The… pic.twitter.com/9sEfPGjG2S
— Amit Shah (@AmitShah) July 12, 2024
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..