
Andhra Pradesh Jobs : ఆంధ్రప్రదేశ్ యువతకు శుభవార్త! ప్రభుత్వం ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రభుత్వం రాష్ట్ర యువతకు శుభవార్త ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఎలాంటి పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్‌మెంట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
వచ్చే విద్యా సంవత్సరం నాటికి వేలాది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. గత ప్రభుత్వం విడుదల చేసిన 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హోం, ఎడ్యుకేషన్ సహా అన్ని విభాగాల్లో ఖాళీల భర్తీకి ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఏపీ ప్రభుత్వం ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి సిద్ధమైంది.
Andhra Pradesh job vacancies
ఉద్యోగాలు ఖాళీలు:
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 – 3 పోస్టులు,
- మహిళా నర్సింగ్ ఆర్డర్లీ – 20 పోస్టులు,
- శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్ – 38 పోస్టులు.
అర్హతలు:
అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి ఇంటర్మీడియట్ + డిప్లొమా లేదా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో బ్యాచిలర్/మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. మహిళా నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులకు 10వ తరగతి, ప్రథమ చికిత్స సర్టిఫికేట్ అవసరం. శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
Andhra Pradesh jobs application details ముఖ్యమైన తేదీలు:
- నోటిఫికేషన్ విడుదల: 31-12-2024,
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 06-01-2025,
- దరఖాస్తుకు చివరి తేదీ: 20-01-2025.
- పని దినాలలో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి.
దరఖాస్తు ప్రక్రియ: జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి, కాకినాడకు అనుకూలంగా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా దరఖాస్తు రుసుము. OC/BC: రూ. 500, SC/ST/PWD: రూ. 200.
ఎంపిక ప్రక్రియ: మెరిట్ ఆధారిత, 75% అకడమిక్ మార్కులు, వివిధ అంశాల ఆధారంగా మిగిలిన మార్కులు కేటాయిస్తారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..