
RSS New Office in Delhi | రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా ఢిల్లీలోని జనాదవాల్ లోని దాని పాత కార్యాలయానికి తిరిగి వచ్చింది. కొత్తగా నిర్మించిన ఈ భవన సముదాయం 3.75 ఎకరాల విస్తీర్ణంలో ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కొత్తగా నిర్మించిన ఈ కార్యాలయం 13 అంతస్తులను కలిగి ఉంది, ఇందులో దాదాపు 300 గదులు ఉన్నాయి. ఈ కార్యాలయ పునర్నిర్మాణానికి రూ. 150 కోట్లు వెచ్చించింది. 75,000 మందికి పైగా మద్దతుదారులు పునరుద్ధరణకు విరాళాలు అందించారు.
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagavat) , ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే ఫిబ్రవరి 19న జరిగే “కార్యకర్త సమ్మేళన్”కు హాజరవుతారు, ఈ సందర్భంగా సంస్థ కొత్త అధునాతన కార్యాలయానికి అధికారికంగా తిరిగి వస్తుంది.
RSS New Office : కొత్త భవనం ఎలా ఉంది..
గుజరాత్‌కు చెందిన ఆర్కిటెక్ట్ అనుప్ డేవ్ కొత్త ఆర్ఎస్ఎస్ (Rashtriya Swayamsevak Sangh) ప్రధాన కార్యాలయాన్ని రూపొందించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పురాతన నిర్మాణ కళలను ఉపయోగించి నిర్మించారు. సాధన, ప్రేరణ, అర్చన అనే మూడు టవర్లు సహజ సూర్యకాంతి, వెంటిలేషన్‌ను పెంచే విధంగా నిర్మించారు. ఈ భవనంలో రెండు పెద్ద ఆడిటోరియంలు కూడా ఉన్నాయి, వాటిలో ఒకటి రామాలయ ఉద్యమంలో ముఖ్యమైన వ్యక్తి అయిన అశోక్ సింఘాల్ పేరు మీద పెట్టారు. ఒక హాలులో 463 మంది కూర్చునే సామర్థ్యం ఉండగా, మరొక హాలులో 650 మంది కూర్చునే సామర్థ్యం ఉంది.
ఈ కార్యాలయ భవనంలో మూడు ఎత్తైన టవర్లను (గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 12 అంతస్తులు) కలిగి ఉంది. ఇవి వివిధ కార్యాచరణ అవసరాలను తీరుస్తాయి. ఈ టవర్లకు సాధన, ప్రేరణ, అర్చన అని పేరు పెట్టారు.
సాధన టవర్ (టవర్ 1): పరిపాలనా కార్యాలయాలతో కూడిన ప్రాంట్ కార్యాలయ ఉంటుంది. పదవ అంతస్తులో ఒక లైబ్రరీ ఉంది. ఇది ప్రజల కోసం తెరిచి ఉంటుంది.
ప్రేరణ టవర్ (టవర్ 2): ఇది ప్రవాసీ కార్యకర్తల కోసం రూపొందించారు. ఈ టవర్ వసతి, పని స్థలాన్ని అందిస్తుంది. తొమ్మిదవ అంతస్తులో జర్నలిస్టుల కోసం ప్రత్యేక హాలు ఉంది. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దేశ రాజధానిని సందర్శించినప్పుడల్లా ఈ భవనంలోనే బస చేస్తారు.
అర్చన టవర్ (టవర్ 3): సహాయక సిబ్బంది, ఇతర నగరాలు, పట్టణాల నుంచి వచ్చే సభ్యుల కోసం అంకితం చేయబడింది.
ఈ కార్యాలయ సముదాయంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన లైబ్రరీ, హెల్త్ క్లినిక్, RSS కార్యకర్తలకు వసతి సౌకర్యాలు, మురుగునీటి శుద్ధి కర్మాగారం కూడా ఉన్నాయి. భవనం విద్యుత్ సరఫరా మొత్తం కార్యాలయ స్థలంలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ప్లాంట్ (Solar Power ) ద్వారా అందుతుంది. అంతేకాకుండా, RSS-అనుబంధ వారపత్రికలు ఆర్గనైజర్, పాంచజన్య, సురుచి ప్రకాశన్ ఇదే ప్రాంగణం నుంచి నడుస్తాయి. స్థానికులు RSS ప్రధాన కార్యాలయంలని లైబ్రరీ, ఆరోగ్య సేవలను పొందవచ్చు.
#WATCH | Delhi | The new headquarters of the Rashtriya Swayamsevak Sangh (RSS), 'Keshav Kunj,' has been completed in Delhi. The RSS has shifted its office back to its old address in the city. The reconstruction project spans 3.75 acres and consists of three 12-story buildings,… pic.twitter.com/vOkojE4FGE
— ANI (@ANI) February 12, 2025
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.