వారం రోజుల్లోనే రూ.500కి గ్యాస్ సిలిండర్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Rs 500 for Gas cylinder : మరో వారం రోజుల్లోనే రూ.500లకే గ్యాస్ సిలిండర్ తోపాటు పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ (200 Units Free Power) అమలుపై ఆదేశాలు జారీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. సీఎం హోదాలో మొదటిసారి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ (Kodangal) కు బుధవారం చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ..
వచ్చే వారం రోజుల్లోనే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ (Rs 500 for Gas cylinder) అందించి ఆడపడుచుల కష్టాలు తీరుస్తామన్నారు. అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని కూడా అమలు చేస్తామని, వచ్చే నెల 16 లోగా అర్హలైన రైతులకు రైతు భరోసా (Rythu Bandhu) అందిస్తామని స్పష్‌టం చేశారు. మరోవైపు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామని, ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని పేర్కొన్నారు నారాయణపేట్- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని 2014లో తానే మంజూరు చేయించుకొచ్చానని తెలిపారు. కానీ గత కేసీఆర్ ప్రభుత్వం నారాయణపేట్- కొడంగల్ పథకాన్ని పదేండ్లు పడావు పెట్టిందని, కొమ్మోడి వెంబడి సన్నాయి వాడు పడినట్లు బీజేపీ వైఖరి ఉందంటూ సెటైర్లు వేశారు.
గత పాలకుల మంచి నిర్ణయాలు కొనసాగిస్తాం..
తెలంగాణ అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. , నగరాభివృద్ధి కోసం గత ప్రభుత్వాలు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు సీఐఐతో కలిసి ముందుకుసాగుతామని తెలిపారు. 64 ఐటీఐలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా రూ.2వేల కోట్లతో అభివృద్ధి చేయబోతున్నామని, స్కిల్లింగ్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నామని వివరించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో చేరిన విద్యార్థులకు డిగ్రీ సర్టిపికెట్లు ఇవ్వనున్నామని తెలిపారు. తెలంగాణలో డ్రైపోర్ట్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
Very nice