Telangana Districts | మళ్లీ జిల్లాల పునర్విభజన.. ఆ18 జిల్లాలు రద్దవుతాయా?
Redistribution Telangana Districts : తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అంశం మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. గత ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసమంటూ తెలంగాణలో మొత్తం 33 జిల్లాల గా విభిజించింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 33 జిల్లాలను కుదిస్తూ 17 లోక్ సభ నియోజకవర్గాలను జిల్లాలుగా ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
ఒకవేళ పునర్విభజన నిర్ణయం అమలైతే ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, గవ్వాల్, వనపర్తి, జనగామ, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు రద్దు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కొన్ని జిల్లాలు రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు మొత్తం 10 జిల్లాలు (Telangana Districts) ఉండగా.. కోసం గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏకంగా 33 జిల్లాలుగా విభజించింది. ఆయా జిల్లాల్లో అధికారుల నియామకాలతోపాటు సమీక్రుత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణాలు చేపట్టింది. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో జిల్లాల సంఖ్య విషయంలో మరోసారి మార్పులు చేయాలని సీఎం భావిస్తున్నారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
👍👍