RBI Recruitment 2024 | నిరుద్యోగులకు శుభవార్త.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్ కార్యక్రలాపాలను పర్యవేక్షిస్తూ ఉండే ఆర్.బి.ఐ రిజర్వ్ బ్యాంక్ ఆ ఇండియా నుంచి డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నొటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. డిగ్రీ పాసైన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం వెతికే ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వదులుకోకుండా అప్లై చేస్తే మంచిది.
దేశవ్యాప్తంగా ఆర్బీఐ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ఆర్బీఐ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇవి ఆఫీసర్ గ్రేడ్ బి ఉద్యోగాలని తెలుస్తుంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా ఈసారి మొత్తంగా 94 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. డిగ్రీ ఉత్తీర్ణత అయ్యి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ జాబ్ కి ఎంపికైన వారు నెలకు దాదాపు లక్ష జీతం దాకా తీసుకునే ఛాన్స్ ఉంది. ఐతే ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అంటే అభ్యర్ధులకు వయసు 21 నుంచి 30 ఏళ్లు మధ్య ఉండాలి. ప్రిమిలినరీ, మెయిన్ పరీక్షలు క్లియర్ చేసి ఆ తర్వాత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇలా అన్ని క్లియర్ చేశాక ఈ జాబ్ కి ఎంపిక చేస్తారు.
ఆసక్తి ఉన్న అభ్యర్ధులు ఆగష్టు 16 వరకు ఆన్ లైన్ లో ఈ జాంబ్ కు అప్లై చేసుకోవచ్చు. ఆర్బీఐ మొత్తం పోస్టుల సంఖ్య 94.. అందులో ఆఫీసర్ గ్రేడ్ బి 66 కాగా.. మిగతా విభాగాల్లో 21, 07 ఖాళీలు ఉన్నాయి. ఏదైన డిగ్రీ అర్హత ఉన్న వారు అర్హులు. ఏమే, పీజీ ఉత్తీర్ణత ఉన్న వారు కూడా ర్హులే. ఈ జాబ్ కు కేవలం 21 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న వారు మాత్రమే అర్హులు.
ఎంపిక విధానం :
RBI Recruitment 2024 : ప్రిలిమినరీ, మెయిన్ పరీక్ష క్లియర్ చేయాల్సి ఉంటుంది. అందులో సెలెక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ ఉద్యోగాంకి ఎంపికైన వారికి 55200 నుంచి 99750 వరకు జీతం ఉంటుంది. జూలై 25 నుంచి దరఖాస్తు ప్రారంభమైంది.
దరఖాస్తు చివరి తేడీ 16-08-2024.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..