
Acharya Satyendra Das | రామాలయ ప్రధాన పూజారి ఆచార్య మహంత్ సత్యేంద్ర దాస్ బుధవారం ఉదయం కన్నుమూశారు. 85 సంవత్సరాల వయసులో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ లక్నోలోని సంజయ్ గాంధీ పీజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SGPGI)లో చికిత్స పొందుతున్నారు.
మహంత్ సత్యేంద్ర దాస్(Satyendra Das)ను మొదట అయోధ్య(Ayodhya) లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు, కానీ తరువాత అధునాతన వైద్య సంరక్షణ కోసం SGPGIకి తరలించారు. ఆయన మధుమేహం, అధిక రక్తపోటుతో సహా తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులతో పోరాడుతున్నారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం సాయంత్రం SGPGIని సందర్శించి ఆయన ఆరోగ్యాన్ని పరిశీలించారు.
Acharya Satyendra Das : రామ జన్మభూమి ఉద్యమంలో చురుకైన ప్రాత్ర
Ram Janmabhoomi Movement : డిసెంబర్ 6, 1992న బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు నుంచి మహంత్ సత్యేంద్ర దాస్ రామాలయ (Ram Temple) ప్రధాన పూజారిగా ఉన్నారు. కేవలం తొమ్మిది నెలల ముందు ఆ బాధ్యతను చేపట్టారు. నిర్వాణి అఖారాలో గౌరవనీయ సభ్యుడైన ఆయన 20 సంవత్సరాల వయస్సు నుంచే ఆధ్యాత్మిక సేవకు తన జీవితాన్ని అంకితం చేశారు.
సీఎం యోగి మృతికి సంతాపం
ఆచార్య దాస్ మరణం పట్ల సీఎం యోగి (Yogi Adityanath) విచారం వ్యక్తం చేశారు. X లో ఒక పోస్ట్‌లో, “శ్రీరాముని అత్యున్నత భక్తుడు, శ్రీ రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి, అయోధ్య ధామ్ ఆచార్య సత్యేంద్ర కుమార్ దాస్ జీ మహారాజ్ మరణం చాలా బాధాకరం. ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని నష్టమని పేర్కొన్నారు. “శ్రీ రాముని ఆత్మకు ఆయన పాదాల వద్ద స్థానం కల్పించాలని, దుఃఖంలో ఉన్న శిష్యులకు, అనుచరులకు సానుభూతి తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.