Ayodhya : శ్రీరామనవమి పర్వదినం (Ram Navami 2024) సందర్బంగా ఏప్రిల్ 17న అయోధ్య రామాలయాన్ని భారీ సంఖ్యలో భక్తులు సందర్శించే అవకాశముంది. ఈ నేపథ్యంలో రామమందిర్ ట్రస్ట్ భక్తులకు కీలక సూచన చేసింది. అయోధ్యలో రాముడి విగ్రహం ప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలిసారి శ్రీరామ నవమి వేడుకలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు 25లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అయోధ్యలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు శ్రీరామనవమి రోజున అయోధ్యకు రావద్దని రామమందిర్ ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది
వీఐపీ పాసులు రద్దు..
అయోధ్య రామాలయానికి సంబంధించిన అన్ని VIP పాస్‌లను ఏప్రిల్ 18 వరకు మూడు రోజుల పాటు రద్దు చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర సభ్యుడు ఒకరు వెల్లడించారు. ప్రముఖులు, విఐపిలందరూ ఏప్రిల్ 19 తర్వాత మాత్రమే అయోధ్యను సందర్శించాలని రామ్ టెంపుల్ ట్రస్ట్ సూచించింది. ఇది ఏప్రిల్ 17న జరగనున్న రామ నవమి వేడుకలకు ముందు వస్తుంది.
రామనవమి వేడుకల సందర్భంగా , రామాలయ ద్వారాలు తెల్లవారుజామున 3:30 గంటలకు తెరిచి ఉంచనున్నారు. శ్రీరామనవమి రోజు భోగ్ నైవేద్యానికి సంక్షిప్త విరామాలు తప్ప.. ఆలయ ద్వారాలు రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటాయి.
సాధారణ రోజుల్లో రాత్రి 9:30 గంటలకు గేట్లు మూసివేస్తారు. పండుగ నేపథ్యంలో “ఏప్రిల్ 16, 17, 18, 19 తేదీల్లో సుగం దర్శన్ పాస్, విఐపి దర్శన్ పాస్, మంగళ ఆరతి పాస్, శృంగర్ ఆరతి పాస్, శయన్ ఆరతి పాస్ వంటి పాస్‌లు ఏవీ జారీ చేయరు. అంటే ఈ రోజుల్లో అన్ని ప్రత్యేక అధికారాలు రద్దు చేయబడతాయి” ఆలయ ట్రస్ట్ తెలిపింది.
అయోధ్య అంతటా ఎల్ ఈడీ స్క్రీన్‌లు
Ram Navami 2024 : శ్రీరాముడి కల్యాణ వేడుకలకు సంబంధించి అన్ని ఈవెంట్లను అయోధ్య మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని దాదాపు 80-100 LED స్క్రీన్‌లపై ప్రదర్శించనున్నారు. ఈ ప్రక్రయను ప్రసార భారతి చేపట్టింది” అని ట్రస్ట్ తెలిపింది. ఆలయ ట్రస్ట్ యాత్రికుల కోసం సేవా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. భక్తులు క్యూలలోకి ప్రవేశించే ముందు మొబైల్ ఫోన్‌లతో సహా తమ వస్తువులను తాము నిర్ధేశించిన ప్రదేశాలలో డిపాజిట్ చేయాలని సూచించారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..