Posted in

వావ్ చల్లని కబురు.. వర్షాలు కురుస్తాయట.. ఎప్పుడో తెలుసా?

rain-in-telangana
Spread the love

వారం పది రోజులుగా తెలంగాణలో ఎండలు భగ్గు మంటున్నాయి. గతంలో ఎప్పుడూ చూడని రేంజ్‌లో దంచికొడుతున్నాయి. ఉదయం 7 గంటలు దాటితే చాలు ఇంటి నుంచి కాలు బయట పెట్టేందుకు జంకే పరిస్థితి నెలకొంది. 9గంటలకే మధ్యాహ్నానాన్ని తలపించేలా సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. అయితే తీవ్రమైన మండుటెండలతో మాడిపోతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ చల్లని కబురు రాష్ట్రంలో శుక్రవారం పొడి వాతావరణం ఉంటుందని, శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

అంతే కాదండోయ్ దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ రాష్ట్రం వరకు సముద్రమట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో మన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కరుస్తాయన్ని వాతావరణ శాఖ తెలిపింది. ఇక హైదరాబాద్‌ మహానగరంతో పాటు చుట్టు పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39°C నుంచి 41°C వరకు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. గత వారం రోజులుగా ఎండలతో తీవ్ర తల్లడిల్లిపోతున్న రాష్ట్ర ప్రజలకు కాస్తయినా ఉపశమనం కలుగనుంది.


Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,

టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *