Railway Track Security | రైలు ప్రమాదాల కట్టడికి భారతీయ రైల్వే కీలక నిర్ణయం..

Railway Track Security | రైలు ప్రమాదాల కట్టడికి భారతీయ రైల్వే కీలక నిర్ణయం..

Railway Track Security | దేశంలో ఇటీవ‌ల చోటుచేసుకుంటున్న రైలు ప్ర‌మాదాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో రైలు ప్ర‌మాదాలను నివారించేందుకు భార‌తీయ రైల్వే కీల‌క నిర్ణ‌యం తీసుకుందిన ఆగస్ట్ 17న కాన్పూర్ – భీమ్‌సేన్ జంక్షన్ మధ్య అహ్మదాబాద్-బౌండ్ సబర్మతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన విష‌యం తెలిసిందే.. మ‌రోసారి ఇలాంటి సంఘటనలు జ‌ర‌గ‌కుండా రైల్వే ట్రాక్ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసింది. కొంద‌రు దుండ‌గులు ఉద్దేశ‌పూర్వ‌క‌గాట్రాక్‌పై సైకిళ్లు, రాళ్లను పెడుతున్న‌ట్లు గుర్తించారు. దీంతో రౌండ్-ది-క్లాక్ ట్రాక్ భద్రతను మెరుగుపరచడానికి మంత్రిత్వ శాఖ వివిధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాలను అన్వేషిస్తున్నట్లు నివేదికలు వెల్ల‌డిస్తున్నాయి.

READ MORE  vande sadharan : వేగవంతమైన.. సౌకర్యవంతమైన ప్రయాణం..

రైల్వే బోర్డు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ట్రాక్ మెయింటెయినర్‌ల ద్వారా అప్రమత్తతను పెంచాలని ఆదేశించింది. ఇప్పుడు రౌండ్-ది క్లాక్ పెట్రోలింగ్ కొన‌సాగుతూనే ఉంటుంది. ఇండియన్ రైల్వే పర్మనెంట్ వే మాన్యువల్ ప్రకారం గతంలో ప్రత్యేక పరిస్థితులకు పరిమితమైన నైట్ పెట్రోలింగ్ సరిపోపోవ‌డం లేద‌ని గుర్తించింది. సాధారణ భద్రత కోసం కాకుండా తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రధానంగా రాత్రి పెట్రోలింగ్‌ను పెంచాల‌ని నిర్ణ‌యించారు.

అయితే ట్రాక్ మెయింటెయినర్స్ యూనియన్ ఈ చర్యకు మద్దతు ఇస్తుండగా, మ‌రోవైపు సిబ్బంది కొరత తోపాటు ట్రాక్-సంబంధిత విధులకు సిబ్బంది అల‌స‌త్వం కార‌ణంగా ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయని ఆల్ ఇండియా ట్రాక్ మెయింటెయినర్స్ యూనియన్ (AIRTU) విమర్శించింది, 15-30% ట్రాక్ మెయింటెయినర్‌లను సీనియర్ అధికారులు వ్యక్తిగత పని కోసం మళ్లించారని, మిగిలిన సిబ్బందిపై పనిభారం పెంచుతున్నార‌ని ఆరోపించింది.

READ MORE  ADR report | 17వ లోక్‌సభలో అత్యంత తక్కువ ప్రశ్నలు అడిగిన పార్టీలు ఇవే..

సాంకేతిక పరిష్కారాలు అమ‌లు చేసే వర‌కు ట్రాక్ భద్రత (Railway Track Security) ను మెరుగుపరచడానికి ఏడాది పొడవునా తప్పనిసరిగా సిబ్బందిచే రాత్రి పెట్రోలింగ్‌ని కొన‌సాగించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ (NFIR) నిర్వహణ, భద్రతా పనులు రెండింటికీ తగిన సిబ్బందిని నియమించాల‌ని, ట్రాక్ మెయింటెయినర్ పోస్టులను పెంచాలని పిలుపునిచ్చింది.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

READ MORE  Bengaluru Metro Phase 3 | బెంగళూరు మెట్రో ఫేజ్-3: భూసేకరణ ప్రణాళిక సిద్ధం.. 2028కి పూర్తి

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *