Saturday, August 30Thank you for visiting

UTS Mobile App : జనరల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఆన్ లైన్ టికెటింగ్‌లో కీలక అప్ డేట్..

Spread the love

UTS Mobile App : దేశవ్యాప్తంగా ఉన్న రైలు ప్రయాణికులకు ఒక పెద్ద వరంలాగా, భారతీయ రైల్వేలు టికెటింగ్ విధానంలో అద్భుత‌మైన మార్పును తీసుకువచ్చింది, ముఖ్యంగా జ‌న‌ర‌ల్‌ కోచ్‌లలో ప్రయాణించే వారికి ఎంతో మేలు చేస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్ (UTS) స్మార్ట్‌ఫోన్ యాప్‌ను ఉపయోగించి టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి 20 కిలోమీటర్ల పరిమితిని రైల్వే అధికారులు తొలగించారు.
ఇది ల‌క్ష‌లాది మంది రైళ‌/ ప్రయాణీకులకు ఎంతో ఉపశమనాన్ని క‌లిగిస్తుంది.

UTS యాప్ అప్‌డేట్‌తో కొత్తగా టికెటింగ్

జన‌ర‌ల్ క్లాస్ ప్రయాణీకులకు టికెటింగ్‌ను సులభతరం చేసేందుకు UTS మొబైల్ యాప్ పునరుద్ధరించారు. కీలకమైన మార్పులలో యాప్ ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకునే దూర పరిమితిని తొలగించడం తోపాటు తద్వారా ప్రయాణీకులు తమ ఇళ్ల నుంచే జ‌న‌ర‌ల్ టిక్కెట్‌లను కొనుగోలు చేసే వెసులుబాటును క‌ల్పించింది.అయితే, ప్రయాణికులు ప్లాట్‌ఫారమ్‌పై ఉండ‌గా లేదా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు UTS మొబైల్ యాప్‌ని ఉపయోగించి ఆన్‌లైన్ టిక్కెట్లను బుక్ చేసుకోలేరని అధికారులు స్పష్టం చేశారు.

భారతీయ రైల్వేలు ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు జ‌న‌ర‌ల్‌ కోచ్‌లలో ప్ర‌యాణిస్తుంటారు. UTS మొబైల్ యాప్‌కు చేసిన ముఖ్యమైన అప్‌డేట్‌లు టిక్కెట్‌లను కొనుగోలు చేయడానికి సులభమైన పద్ధతిని అందిస్తాయి. UTS యాప్ కోసం జియో-ఫెన్సింగ్ దూర పరిమితిని రైల్వే ఉపసంహరించుకుంది, తక్షణమే అమలులోకి వస్తుంది. దీనర్థం ప్రయాణికులు ఇప్పుడు ప్లాట్‌ఫారమ్ టికెట్ తోపాటు , జ‌న‌ర‌ల్‌ టిక్కెట్‌లను వారి ఇళ్ల నుంచే కొనుగోలు చేయవచ్చు.

అన్ రిజర్వ్డ్  ప్రయాణికులకు వరం

UTS Mobile App (అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్) స్మార్ట్‌ఫోన్ యాప్ ప్రయాణికులు ఎటువంటి దూర పరిమితి లేకుండా అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్‌లను కొనుగోలు చేసుకోవ‌చ్చు. ఈ కొత్త ఫీచర్ ప్రయాణికులు ఎక్కడి నుండైనా జ‌న‌ర‌ల్‌ టిక్కెట్‌లను కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది, గతంలో, ప్రయాణికులు స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌కు 20 కిలోమీటర్ల లోపు ఉన్న‌ప్పుడు మాత్ర‌మే UTS మొబైల్ యాప్ ద్వారా సాధారణ టిక్కెట్లను బుక్ చేసుకునేవారు. ఇప్పుడు, దూర పరిమితి ఎత్తివేయడంతో, సాధారణ టిక్కెట్లను ఏ ప్రదేశం నుంచైనా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.

UTS మొబైల్ యాప్‌ని ఉపయోగించి, ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్ల‌లో పేపర్‌లెస్ జనరల్ టిక్కెట్‌లు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లు, సీజన్ టిక్కెట్‌లను పొంద‌వ‌చ్చు. ఈ మార్పు ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా టికెటింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది, పేపర్ వినియోగం తగ్గిపోవ‌డం వ‌ల్ల పర్యావరణానికి కూడా మేలు జ‌రుగుతుంది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి.. ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *