రైల్వేలో 4800+ పోస్టులు రెడీ, ఇలా అప్లయ్ చేయండి
Railway Recruitment | సెంట్రల్ రైల్వేలోని వివిధ వర్క్‌షాప్‌లు మరియు యూనిట్లలో వివిధ ట్రేడ్‌లలో శిక్షణ పొందేందుకు యాక్ట్ అప్రెంటీస్‌ల రిక్రూట్‌మెంట్ కోసం ITI అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి. మొత్తం 2,424 స్థానాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 15 ఆగస్టు 2024 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి.
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, సెంట్రల్ రైల్వే వివిధ ట్రేడ్‌లలో అప్రెంటీస్‌ల ఉద్యోగాల కోసం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించింది. ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, టైలర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ప్రోగ్రామింగ్ & సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్, మెకానిక్ డీజిల్, టర్నర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబ్ అసిస్టెంట్, షీట్ మెటల్ వర్కర్, కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ మొదలైనవి.
రైల్వేలో భారీగా పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ రెండు నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. ఈ రెండు నోటిఫికేషన్స్ ద్వారా 4,862 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్స్ Central Railway, Southern Railway నుండి విడుదల చేశారు.
– సెంట్రల్ రైల్వే లో 2,424 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
– సదరన్ రైల్వే లో 2,438 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం, జీతం వంటి ముఖ్యమైన సమాచారం
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
Railway Recruitment Cell , Central Railway, Southern Railway నుండి ఈ నోటిఫికేషన్స్ విడుదల అయ్యాయి.
– మొత్తం ఖాళీల సంఖ్య : 4,862
సెంట్రల్ రైల్వే లో 2,424 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
సదరన్ రైల్వే లో 2,438 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
– భర్తీ చేస్తున్న పోస్టులు : అప్రెంటీస్ పోస్టులు
విద్యార్హత :
సంబంధిత ట్రేడ్ లో 10th + ITI విద్యార్హతలు కలిగి ఉండాలి. / సంబంధిత సబ్జెక్స్ లో ఇంటర్ అర్హత ఉండాలి.
స్టైఫండ్:
ఎంపికైన అభ్యర్థులకు స్టైఫండ్ ఇస్తారు.
కనీస వయస్సు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 15 సంవత్సరాలు ఉండాలి.
గరిష్ట వయస్సు :
పోస్టులను అనుసరించి 24 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారి ఈ పోస్టులకి అప్లై చేయవచ్చు.
అప్లికేషన్ విధానం :
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
ఎంపిక విధానం :
అప్లై చేసిన అభ్యర్థులకు 10th + ITI, 10+2 లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు 100/-
అప్లికేషన్ చివరి తేదీ :
Central Railway Apprentice పోస్టులకు ఆగస్ట్ 15వ తెదిలోపు అప్లై చేయాలి.
Southern Railway Apprentice పోస్టులకు ఆగస్ట్ 12వ తెదిలోపు అప్లై చేయాలి.