Wednesday, July 30Thank you for visiting

Indian Railways | మూడు రాష్ట్రాల్లో ₹6,405 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం

Spread the love

కార్బన్ ఉద్గారాల తగ్గింపు – డీజిల్ ఆదా – గ్రామీణ కనెక్టివిటీకి ఊతం

Railway Infrastructure | రైల్వే మౌలిక సదుపాయాలు, ప్రాంతీయ కనెక్టివిటీని పెంచేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం బుధవారం రెండు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అవి జార్ఖండ్‌లోని కోడెర్మా-బర్కకానా డబ్లింగ్, కర్ణాటక – ఆంధ్రప్రదేశ్‌లోని బల్లారి-చిక్జాజూర్ డబ్లింగ్ (Ballari–Chikjajur doubling ) ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు రాబోయే మూడు సంవత్సరాలలో పూర్తవుతాయిని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్ల‌డించారు. మొత్తం అంచనా వ్యయం రూ. 6,405 కోట్లు, దీంతో భారత రైల్వే నెట్‌వర్క్‌ను 318 కి.మీ.ల మేర విస్తరిస్తుంది.

ఈ రెండు లైన్లు ప్రయాణీకులకు రైల్వే సేవ‌లతోపాటు, సరుకు రవాణాకు కీలకంగా మార‌నున్నాయి. అలాగే కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తాయి. “కనెక్టివిటీని మెరుగుపరచడానికి, ఆర్థిక వ్యవస్థను పెంచడానికి రెండు ప్రాజెక్టులు ముఖ్య‌మైన‌వి. గిరిజన వర్గాలకు, సాధారణ జనాభాకు ప్రయోజనం చేకూరుస్తాయి” అని కేంద్ర మంత్రి విలేకరుల సమావేశంలో అన్నారు.

కోడెర్మా–బర్కకానా లైన్

Koderma Barkakana doubling : 133 కి.మీ.ల విస్తీర్ణంలో ఉన్న కోడెర్మా–బర్కకానా (అరిగడ) డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ.3,063 కోట్ల వ్యయంతో ఆమోదం లభించింది. ఈ మార్గం పాట్నా, రాంచీ మధ్య అతి తక్కువ రైలు కనెక్షన్‌ను ఏర్పరుస్తుంది నగరాల మధ్య ప్రయాణం, లాజిస్టిక్స్‌కు ఇది చాలా ముఖ్యమైనది.

ఈ మార్గం జార్ఖండ్‌లోని నాలుగు జిల్లాలు – కోడెర్మా, చత్ర, హజారీబాగ్, రామ్‌గఢ్ – గుండా వెళుతుంది. 938 గ్రామాలు, దాదాపు 15 లక్షల జనాభాకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ పథకంలో 17 ప్రధాన వంతెనలు, 180 చిన్న వంతెనలు, 42 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు (ROBలు), 13 రోడ్ అండర్ బ్రిడ్జిలు (RUBలు) నిర్మాణం ఉన్నాయి. ఒకసారి పని ప్రారంభిస్తే, ఇది సంవత్సరానికి అదనంగా 30.4 మిలియన్ టన్నుల సరుకును నిర్వహించగలదని భావిస్తున్నారు.

దీని వలన సంవత్సరానికి 163 కోట్ల కిలోగ్రాముల CO₂ ఉద్గారాలు, 32 కోట్ల లీటర్ల డీజిల్ ఆదా అవుతుందని భావిస్తున్నారు – ఇది ఏడు కోట్ల చెట్లను నాటడంతో సమానమైన పర్యావరణ ప్రయోజనం అని వైష్ణవ్ అన్నారు.

బళ్లారి–చిక్జాజూర్ డబ్లింగ్

Ballari–Chikjajur doubling : ఇక బళ్లారి-చిక్జాజూర్ డబ్లింగ్, 185 కి.మీ.ల పొడవును కలిగి ఉంది. రూ. 3,342 కోట్ల అంచనా వ్యయంతో చేప‌డుతున్నారు. ఈ లైన్ మంగళూరు పోర్టును సికింద్రాబాద్‌కు కలుపుతుంది. ఇనుప ఖనిజం, కోకింగ్ బొగ్గు, ఉక్కు, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులు, ఆహార ధాన్యాలు వంటి కీలక వస్తువులను తరలించడానికి ఈ మార్గం ఎంతో కీల‌క‌మైన‌ది.

ఈ వెంచర్ కర్ణాటకలోని బళ్లారి, చిత్రదుర్గ జిల్లాలకు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ జిల్లాకు కనెక్టివిటీని పెంచుతుంది. 19 స్టేషన్లు, 29 ప్రధాన వంతెనలు, 230 చిన్న వంతెనలు, 21 ROBలు, 85 RUBలతో, ఈ లైన్ నిర్మిత‌మ‌వుతుంది.. బళ్లారి-చిక్జాజూర్ 470 గ్రామాలలో సుమారు 13 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. ఏటా అదనంగా 18.9 మిలియన్ టన్నుల సరుకును సులభతరం చేస్తుంది.

ఈ లైన్ భారీగా పర్యావరణ లాభాలను అందిస్తుంది. కార్బన్ ఉద్గారాలను 101 కోట్ల కిలోగ్రాముల మేర తగ్గించడంతోపాటు ఏటా 20 కోట్ల లీటర్ల డీజిల్ ఆదా చేయడం, ఇది నాలుగు కోట్ల చెట్లను నాటడానికి సమానమ‌ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ‌వ్ వెల్ల‌డించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *