Watch | దేశవ్యాప్తంగా ఎన్నికల పండుగ.. కుతుబ్ మినార్ ఎలా వెలిగిపోతుందో చూడండి..
Qutub Minar | దేశవ్యాప్తంగా ఓట్ల పండుగ ప్రారంభమైంది. ఓటింగ్ ప్రారంభం కావడంతో భారతదేశం ప్రస్తుతం ప్రజాస్వామ్య ఉత్సాహంలో మునిగిపోయింది. ఈ వేడుకల మధ్య ఢిల్లీలోని కుతుబ్ మినార్ (Qutub Minar ) “చునావ్ కా పర్వ్” (ఎన్నికల) థీమ్ కు సంబంధించి అద్భుతమైన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది.
భారతదేశ సుసంపన్నమైన వారసత్వం, సంస్కృతికి ప్రతీక అయిన కుతుబ్ మినార్ రాత్రిపూట అద్భుతమైన రంగులతో దర్శనమిస్తుంది. ఇది ప్రజల్లో ఓటింగ్ పై స్ఫూర్తిని నింపడానికి వోటింగ్ గొప్పతనాన్ని చాటే లైటింగ్ విజువల్స్ ను ప్రదర్శిస్తున్నారు. భారత ఎన్నికల సంఘం Xకి ఒక క్లిప్‌ని పోస్ట్ చేసింది. ఓటు వేయమని ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. “కుతుబ్ మినార్ #ChunavKaParv థీమ్ అద్భుతమైన ప్రదర్శనతో జష్న్-ఎ-మత్తన్ స్ఫూర్తిని ప్రసరింపజేస్తుంది” అని ECI రాసింది. అందరం ఓట్లు వేయడం ద్వారా ఈ పండుగను జరుపుకుందాం. అని చెబుతోంది.
ఇదిలా ఉండగా ఏప్రిల్ 26న రెండో దశ సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని మొత్తం 20, కర్ణాటకలో 14, రాజస్థాన్‌లో 13 స్థానాలకు పోలింగ్ జరిగింది. వాటితో పాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో ఎనిమిది, మధ్యప్రదేశ్‌లో 6, అస్సాం, బీహార్‌లో ఐదు, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లో మూడు, మణిపూర్, త్రిపుర, జమ్మూకశ్మీర్‌లలో ఒక్కో నియోజకవర్గంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
13 రాష్ట్రాలు ఒక యూటీకి చెందిన ఓటర్లు తీవ్రమైన ఎండలను సైతం లెక్కచేయకుండా ఎన్నికల్లో ఓటు వేశారు. నూతన వధూవరుల నుంచి వృద్ధుల వరకు, గిరిజనుల నుంచి ఐటీ నిపుణులు, పీడబ్ల్యూడీలు, మహిళలు, యువకుల వరకు అందరూ ఆయా పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎండ వేడిమి ఉంచి ఉపశమనం కోసం ఓటర్లకు తాగునీరు, మెడికల్ కిట్‌లు, ఫ్యాన్లు తదితర ఏర్పాట్లు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
ఫేజ్ 2లో, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, కాంకేర్ నియోజకవర్గాల్లోని 46 గ్రామాల ఓటర్లు సార్వత్రిక ఎన్నికల కోసం మొదటిసారిగా తమ సొంత గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఈ నియోజకవర్గాల్లో తొలిసారిగా మొత్తం 102 కొత్త పోలింగ్ స్టేషన్లు (ఫేజ్ 1&2 ఎన్నికలు) ఏర్పాటు చేశారు.
Qutub Minar radiates the spirit of Jash-e-Matdan with its dazzling display of the #ChunavKaParv theme.
Let’s celebrate this festivity by casting our votes #GeneralElections2024
📹 @ceodelhi #DeshKaGarv #LokSabhaElections2024 #YouAreTheOne pic.twitter.com/NPhlifadmT
— Election Commission of India (@ECISVEEP) April 27, 2024
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..