PM KISAN Scheme : జూన్ 18న వారణాసిలో పీఎం కిసాన్ పథకం కింద రూ.20,000 కోట్లు విడుదల
PM KISAN Scheme : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద 20,000 కోట్ల నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విడుదల చేయనున్నారు. ఈనెల 18న వారణాసిలో PM-KISAN పథకానికి సంబంధించి 17వ విడత విడుదలతోపాటు 30,000 స్వయం సహాయక బృందాలకు ప్రధాని మోదీ సర్టిఫికేట్‌లను కూడా అందజేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ జూన్ 10న సుమారు 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు రూ. 20,000 కోట్లను పంపిణీ చేసే లక్ష్యంతో పీఎం-కిసాన్ పథకం 17వ విడత నిధుల విడుదలకు తొలి సంతకం చేశారు.
ఫిబ్రవరి 2019లో PM KISAN Scheme ను ప్రారంభించారు. ఈ స్కీం లో చేరిన రైతులకు ఏడాదికి రూ. 6,000 పెట్టుబడి సాయాన్ని రూ. 2,000 చొప్పున మూడు వాయిదాల్లో నేరుగా రైతుల ఆధార్-లింక్డ్ బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తుంది. ఈ పీఎం కిసాన్ పథకం కింద 17వ విడత రూ. 20,000 కోట్లకు పైగా నిధులను వారణాసి నుంచి ప్రధానమంత్రి ఒకే క్లిక్‌తో 9.26 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి చౌహాన్ తెలిపారు.
దేశవ్యాప్తంగా దాదాపు 2.5 కోట్ల మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా. అదనంగా, రైతులకు అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా 732 కృషి విజ్ఞాన కేంద్రాలు (కెవికెలు), 1 లక్షకు పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 5 లక్షల ఉమ్మడి సేవా కేంద్రాలు (సిఎస్‌సి) పాల్గొంటాయి.
ఈ కార్యక్రమంలో, ప్రధాని మోదీ కృషి సఖిలుగా 30,000 కంటే ఎక్కువ స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జి) సర్టిఫికేట్‌లను పంపిణీ చేస్తారు. ఈ ఆర్థిక సహాయం రైతులకు వారి వ్యవసాయ అవసరాలను తీర్చడంలో తోడ్పడుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు బదిలీ అవుతుంది. లబ్ధిదారుల నమోదు, ధృవీకరణలో సంపూర్ణ పారదర్శకత ఉంటుంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..