New Vande Bharat Trains | కొత్తగా మరో 3 వందే భారత్ రైళ్లు.. రైలు మార్గాలు, టైమింగ్స్..
New Vande Bharat Trains | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఇది కీలక రాష్ట్రాల్లో రైలు కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తుంది. కొత్త రైళ్లు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలలో పలు రూట్లలో సేవలు అందిస్తాయి, ఇప్పుడు దేశవ్యాప్తంగా 280 జిల్లాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్ విస్తరణలో మరో మైలురాయిని చేరుకుంది. ప్రధానమంత్రి మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు:
1. చెన్నై సెంట్రల్ నుంచి నాగర్‌కోయిల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
2. మధురై నుంచి బెంగళూరు కంటోన్మెంట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
3. మీరట్ సిటీ నుంచి లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్
Chennai Central to Nagercoil Vande Bharat Express:
మొదట చెన్నై సెంట్రల్ నుంచి వందేభారత్ రైలు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. కానీ ఇది చెన్నై ఎగ్మోర్ నుంచి బుధవారాలు మినహా వారానికి ఆరు రోజులు సేవలందిస్తుంది. మధురైలోని అరుల్మిగు మీనాక్షి అమ్మవారి ఆలయం, కన్యాకుమారిలోని కుమారి అమ్మన్ ఆలయాన్ని సందర్శించే యాత్రికులకు ఈ రైలు ఎంతో ఉపయోగపడనుంది.
టైమింగ్స్ : రైలు నెం. 20627 చెన్నై ఎగ్మోర్ నుంచి ఉదయం 5:00 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 1:50 గంటలకు నాగర్‌కోయిల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు (నం. 20628) నాగర్‌కోయిల్‌లో మధ్యాహ్నం 2:20 గంటలకు బయలుదేరి రాత్రి 11:00 గంటలకు చెన్నై చేరుకుంటుంది.
హాల్టింగ్ స్టేషన్స్ : తాంబరం, విల్లుపురం, తిరుచిరాపల్లి, దిండిగల్, మదురై, కోవిల్‌పట్టి మరియు తిరునెల్వేలి వంటి కీలకమైన స్టాప్‌లు ఉన్నాయి.
Madurai to Bengaluru Cantonment Vande Bharat Express
– ఈ రైలు తమిళనాడులోని చారిత్రాత్మక ఆలయ నగరమైన మదురైని కర్ణాటక రాజధాని బెంగళూరులోని కాస్మోపాలిటన్ హబ్‌తో కలుపుతుంది. ఇది మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది.
టైమింగ్స్ : రైలు నెం. 20671 మదురై నుంచి ఉదయం 5:15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1:00 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం (రైలు నెం. 20672) బెంగళూరు నుండి మధ్యాహ్నం 1:30 గంటలకు బయలుదేరి రాత్రి 9:45 గంటలకు మధురై చేరుకుంటుంది.
హాల్టింగ్స్ : దిండిగల్, తిరుచిరాపల్లి, కరూర్, నమక్కల్, సేలం మరియు కృష్ణరాజపురంలలో ఆగుతుంది.
Meerut city to Lucknow Vande Bharat Express:
– ఈ రైలు ఆదివారం లక్నో నుంచి, సోమవారం మీరట్ నుంచి దాని సాధారణ సర్వీసును ప్రారంభిస్తుంది, మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. – ఈ సర్వీస్ దిగంబర్ జైన్ టెంపుల్, మానస దేవి మందిర్, సూరజ్‌కుండ్ టెంపుల్, ఔఘర్నాథ్ టెంపుల్ వంటి తీర్థయాత్రలకు వేగవంతమైన ప్రయాణాలను అందించడం ద్వారా పర్యాటకాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
రైలు సమయాలు : రైలు నెం. 22490 మీరట్ నగరం నుంచి ఉదయం 6:35 గంటలకు బయలుదేరి, లక్నోలోని చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌కు మధ్యాహ్నం 1:45 గంటలకు చేరుకుంటుంది, తిరుగు ప్రయాణంలో (రైలు నెం. 22489) లక్నోలో మధ్యాహ్నం 2:45 గంటలకు బయలుదేరి రాత్రి 10:00 గంటలకు మీరట్ నగరానికి చేరుకుంటుంది.
హాల్లింగ్ స్టేషన్స్ : మొరాదాబాద్, బరేలీ.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.