PM Modi : కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమే: ప్రధాని మోదీ
PM Modi : జైపూర్ : కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ (PM Modi) పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ప్రజల సంపదను లాక్కొని “ఎంపిక చేసిన” వ్యక్తులకు పంచడానికి భారీ కుట్ర పన్నుతున్నారని మరోసారి ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) వినడం కూడా నేరంగా మారుతుందని మోదీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తం హనుమాన్ జయంతిని జరుపుకుంటున్న రోజున ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్ధాన్‌లో కాంగ్రెస్ పార్టీ శ్రీరామనవమి వేడుకలను కూడా నిషేధించిందని పేర్కొన్నారు. రాజస్ధాన్‌లో మొదటిసారి ఈసారి రామనవమి సందర్భంగా శోభాయాత్ర నిర్వహించారని ఆయన తెలిపారు. ప్రజలు రామ శబ్ధాన్ని ఆలపించే రాజస్దాన్ వంటి రాష్ట్రంలో కాంగ్రెస్ రామనవమిని నిషేధించడమేంటని ప్రశ్నించారు.
రాజస్థాన్‌లోని బన్స్వారాలో ఆదివారం జరిగిన ర్యాలీలో తాను చేసిన ‘సంపద పునఃపంపిణీ’ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్, విపక్ష ఇండియా కూటమికి ఈ వ్యాఖ్యలు ఆగ్రహం కలిగించాయని, అందుకే వారు ప్రతిచోటా మోదీని తిడుతున్నారని అన్నారు. ప్రజల ఆస్తులపై సర్వే చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పొందుపరిచిందని, ఆస్తుల ఎక్స్‌రే చేపడతామని ఆ పార్టీ నేత చెప్పారని మోదీ గుర్తుచేశారు. మోదీ వారి బండారాన్ని బట్టబయలు చేయడంతో వారి రహస్య అజెండా బయటపడి భయంతో వణికిపోతున్నారని మోదీ అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఒకరి విశ్వాసాన్ని అనుసరించడం కష్టమని కూడా ప్రధాని మోదీ ఆరోపించారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..