Wednesday, April 16Welcome to Vandebhaarath

PM Modi: సీఏఏ ర‌ద్దు చేయ‌డం ఎవ‌రి వల్లా కాదు.. ప్రధాని మోదీ.. బెంగాల్‌లో ప్రధానికి ఊహించని గిఫ్ట్‌

Spread the love

కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ సీట్లు వారి యువరాజు వయస్సును మించవు 

PM Modi On CAA | కోల్ క‌తా : తాను ఉన్నంత వరకు ‘సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్ (CAA ) ’ను రద్దు చేయడం ఎవరివల్లా కాదని ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ (PM Modi) స్ప‌ష్టం చేశారు. ప్రధాని మోదీ పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ (Trinamool Congress) పార్టీపై ఆయ‌న‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాగే కాంగ్రెస్ పార్టీపై కూడా సెటైర్‌లు వేశారు. ఈరోజు బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాస్ జిల్లా బరాక్‌పూర్‌లో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ప్ర‌ధాని ప్రసంగించారు. తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ వోటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందన్నారు. సందేశ్‌ఖాలీ(Sandeshkhali ) లో తృణ‌మూల్ కాంగ్రెస్ నేతల చేతిలో అత్యాచారాలకు గురైన బాధిత మహిళలను టీఎంసీ (TMC) గూండాలు బెదిరిస్తున్నారని మోదీ మండిపడ్డారు. ఒక‌వైపు బాధితులను వేధిస్తూనే మ‌రోవైపు షాజహాన్‌ షేక్ వ‌టి నేరస్థులకు రక్షిస్తోంద‌ని విమర్శించారు. టీఎంసీ తీరుతో బెంగాల్‌లో హిందువులు రాముడి పేరు పలకడానికి, శ్రీరామనవమి వేడుక‌ల‌ను జరుపుకోవడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. టీఎంసీ పాలనలో బెంగాల్‌లో హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవిస్తున్నార‌ని ఆరోపించారు.
ఇదే స‌భ‌లో మోదీ కాంగ్రెస్‌ పార్టీపై సెటైర్‌లు వేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ యువరాజు వయసుకు మించికి వోట్లు రావని ఎద్దేవా చేశారు. అంటే ప్రస్తుతం రాహుల్‌గాంధీ వయస్సు 53 సంవత్సరాలు కాబట్టి కాంగ్రెస్‌కు 53 కంటే ఎక్కువ సీట్లు రావని ప్ర‌ధాని మోదీ అన్నారు.

READ MORE  Maharashtra CM | మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఎంపికపై ఏక్ నాథ్ కీలక ప్రకటన

ప్రధాని మోదీకి ఊహించని బహుమతి

ప‌శ్చిమ‌ బెంగాల్‌లో జరిగిన ఎన్నిక‌ల‌ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ (PM modi) హృదయాన్ని కదిలించే స‌న్నివేశం చోటుచేసుకుంది. హుగ్లీలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్నప్పుడు, తన తల్లి దివంగత హీరాబెన్ మోదీతో కలిసి చిత్రాన్ని ఇద్దరు యువ‌కులు పట్టుకుని ఉండడాన్ని ప్రధాని మోదీ గమనించారు. ప్రధానమంత్రి వారిని చూసి మాతృదినోత్సవాన్ని గుర్తుచేసే బహుమానం తనను కదిలించిందని అన్నారు. “ఇక్కడ ఇద్దరు వ్యక్తులు రెండు చిత్రాలను రూపొందించారు. వారు స్కెచ్‌లను పట్టుకుని చాలాసేపు నిలబడి ఉన్నారు. మీరు ఎంతో ప్రేమతో మా అమ్మ పోర్ట్రెయిట్స్ గీశారు. చాలాసేపు నిల‌బి ఉన్నారు. సోదరులారా మీ చేతులు నొప్పి పుడుతాయి. తన తల్లి చిత్రపటాన్ని తీసుకోండ‌ని అక్క‌డే ఉన్న‌ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) కమాండోలను అభ్యర్థించారు మోదీ. “మీరు పోర్ట్రెయిట్‌ల వెనుక మీ పేరు, చిరునామా రాయండి. నేను మీకు తిరిగి మీకు లేఖ రాస్తాను మీ ఇద్దరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను” అని ప్ర‌ధాని మోదీ తెలిపారు.

READ MORE  Kolkatha | బంగ్లాదేశ్ రోగులు మా ఆస్పత్రికి రావొద్దు.. కోల్ కత్తా ఆస్పత్రి నిర్ణయం..

“పాశ్చాత్య దేశాల్లో ప్రజలు ఈ రోజును మదర్స్ డేగా జరుపుకుంటారు”, కానీ భారతదేశంలో, “మేము మా తల్లి, మా దుర్గ, మా కాళి, భారత మాతను, సంవత్సరంలో 365 రోజులు ఆరాధిస్తామని ప్రధాని మోదీ హైలైట్ చేశారు. కాగా యువ‌కులు ప్ర‌ద‌ర్శించిన మొద‌టి చిత్రంలో ప్రధాని నేలపై కూర్చొని తన చేతులతో తల్లి ఒడిలో ఉన్నట్లు ఉంది. రెండో ఫోటోలో హీరాబెన్ తన కొడుకు భుజంపై తన తల్లితో కలిసి కూర్చున్నట్లు ఉంది.

READ MORE  Sandeshkhali row : 'మమతను అరెస్టు చేయాలి.. టిఎంసిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి.. బిజెపి నేత‌ డిమాండ్

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *