PM Modi Tour | నా హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి.. ఎయిర్ స్ట్రైక్స్ కూడా జరుగుతాయి..

PM Modi Tour | నా హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి.. ఎయిర్ స్ట్రైక్స్ కూడా జరుగుతాయి..

PM Modi Tour Live Updates | Sanareddy : తమ హయాంలో సర్టికల్స్ స్ట్రైక్స్ జరిగాయని, ఎయిర్‌స్ట్రైక్స్ కూడా జరుగుతాయని  ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అవినీతిని అంతమొందించేదుకు  మీ సహకారం కావాలని కోరారు. రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ  సంగారెడ్డిలో  అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం పటాన్‌చెరులో బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన  కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై  విమర్శలు చేశారు. ‘‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఒకే నాణేనికి రెండు ముఖాలు. ఈ రెండు పార్టీల మధ్య బలమైన అవినీతి బందం ఉంది. దీని గురించి ప్రపంచమంతా  తెలుసు. కాంగ్రెస్‌ తెలంగాణను ఏటీఎంలా మార్చుకుంది.   కాళేశ్వరం పేరుతో బీఆర్‌ఎస్ రూ.వేల కోట్లు దండుకుంది.  కానీ బీఆర్‌ఎస్ అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వం దాచిపెడుతోంది. కాళేశ్వరంలో వేల కోట్లు అవినీతి జరిగింది తెలిసినప్పటికీ కాంగ్రెస్  ఎందుకు మౌనంగా ఉంది.’’ అని మోదీ ప్రశ్నించారు.  తమ హయాంలో సర్టికల్స్ స్ట్రైక్స్ నిర్వహించామని, ముందుముందు ఎయిర్‌స్ట్రైక్స్ కూడా జరుగుతాయని ప్రధాని మోదీ అన్నారు.  దీనికి ప్రజల సహకారం కావాలని కోరారు.

READ MORE  Mahesh Kumar Goud | తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మ‌హేశ్ కుమార్ గౌడ్

కుటుంబ పాలనపై విమర్శలు

పటాన్ చెరు (Patancheru)  బహిరంగ సభలో కుటుంబ పార్టీల పాలనపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు.  ‘‘వారసత్వ రాజకీయాలను తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని,  కుటుంబ వాదం వల్ల  ప్రతిభ ఉన్నవారికి అన్యాయం జరుగుతోందన్నారు.  యువతకు ఉపాధి లభించడం లేదని,  అవినీతిని బయటపెడుతున్నాననే అక్కసుతో కాంగ్రెస్ నాపై విమర్శలు చేస్తోందన్నారు.  కుటుంబ పాలన కొనసాగించే వారిలో అభద్రతా భావం పెరిగిపోవడంతో వారసత్వ నేతలకు భయం పట్టుకుందన్నారు.  కుటుంబ పాలకుల అవినీతిని  వెలికితీస్తున్నామని, కుటుంబ పార్టీల పాలనలో  వారి కుటుంబాలే బాగుపడ్డాయని,  కుటుంబ పార్టీలకు దోచుకోవడానికి ఏమైనా లైసెన్స్ ఉందా ?’’ అని మోదీ ప్రశ్నించారు.

ప్రపంచంలో మూడో శక్తిగా భారత్

PM Modi Tour : అయోధలో రామమందిరం నిర్మిస్తామని చెప్పాం. ప్రపంచం గర్వించేలా  అయోధ్యలో అద్భుతంగా శ్రీరాముడి ప్రతిష్టాపన జరిగిందన్నారు. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేశామని,  బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుందన్నారు.   తెలంగాణలో బీజేపీకి మద్దతు పెరుగుతోందని, తెలంగాణ ప్రజల్లో ఎంతో ఉత్సాహం కనిపిస్తోందన్నారు.  ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ను మార్చుతామని హామీ ఇచ్చారు.  ప్రపంచదేశాల్లో తెలుగు వారు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియడారు.  మీ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని,  . మీ ప్రేమను తెలంగాణ అభివృద్ధి రూపంలో చూపిస్తానని హామీ ఇచ్చారు.

READ MORE  తెలంగాణ‌లో 9 యూనివ‌ర్సిటీల‌కు వీసీల నియామ‌కం..

అభివృద్ధిప‌నుల ప్రారంభోత్స‌వాలు

  • NH-161 లోని కంది – రామసానిపల్లె సెక్షన్‌లో రూ.1,409 కోట్లతో 4 వరుసల జాతీయ రహదారి ప‌నుల‌కు పనులకు శంకుస్థాపన
  • NH-167 లోని మిర్యాలగూడ – కోదాడ సెక్షన్ లో రూ.323 కోట్లతో 2 వరుసల జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన
  • హైదరాబాద్, సికింద్రాబాద్‌లో రూ.1,165 కోట్లతో చేపట్టిన 103 కి.మీ.ల MMTS ఫేజ్ – II ప్రాజెక్ట్‌కు పనులు ప్రారంభం
  • ఘట్ కేసర్ – లింగంపల్లి మధ్య‌ కొత్త MMTS రైలు ప్రారంభం
  • NH-65 లోని పుణే – హైదరాబాద్ రహదారిలో సంగారెడ్డి ఎక్స్ రోడ్డు నుంచి మదీనాగూడ మధ్ 1,298 కోట్లతో 31 కి.మీ.ల 6 లైన్ల ర‌హ‌దారి విస్తరణకు శంకుస్థాపన
  • 399 కోట్లతో NH-765Dలో మెదక్ – ఎల్లారెడ్డి మధ్య 2 లైన్ హైవే విస్తరణ పనులకు ప్రారంభోత్సవం
  • 500 కోట్లతో NH-765Dలో ఏల్లారెడ్డి – రుద్రూర్ మధ్య 2 లైన్ హైవే విస్తరణ పనులకు శంకుస్థాపన
  • రూ.3,338 కోట్లతో చేప‌ట్టిన‌ పారాదీప్ – హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు.
READ MORE  త్వరలోనే అంద‌రికీ డిజిటల్ హెల్త్ కార్డులు

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *