Saturday, August 30Thank you for visiting

అమెరికా, ఈజిప్ట్ పర్యటనలు ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ

Spread the love

పర్యటనలో ముఖ్యాంశాలు ఇవీ..

న్యూఢిల్లీ : ఆరు రోజుల పాటు అమెరికా తోపాటు , ఈజిప్తు లో తన తొలి పర్యటనను ముగించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ కి చేరుకున్నారు. పాలం విమానాశ్రయంలో ప్రధానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా, కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి.లేఖి,  రాజ్ హన్స్, గౌతమ్ గంభీర్ తో స హా పలు పార్టీల ఎంపీలు ఘనస్వాగతం పలికారు.

సోమవారం తెల్లవారుజామున, ప్రధాని మోదీ తన మొదటి ఈజిప్ట్ పర్యటన వివరాలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ట్విటర్ లో ప్రధాని మోదీ క్లిప్‌ను ట్యాగ్ చేస్తూ, “నా ఈజిప్టు పర్యటన ఒక చారిత్రాత్మకమైనది. ఇది భారతదేశం-ఈజిప్ట్ సంబంధాలను బలోపేతం చేస్తుంది. మన దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది.’’ అని పేర్కొన్నారు

ఈజిప్ట్ అత్యున్నత గౌరవం

ఈజిప్టు అత్యున్నత గౌరవాన్ని(Egypt’s Highest Honour) అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి చేతుల మీదుగా ప్రధాని మోదీ అందుకున్నారు. ఇది ఆయన అందుకున్న పదమూడవ అత్యున్నత గౌరవం. గత తొమ్మిదేళ్లలో, పీఎం మోడీ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగోహు, కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ, రిపబ్లిక్ ఆఫ్ పలావ్ ద్వారా ఎబాకల్ అవార్డులతో సహా అనేక అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు.

ఆదివారం ప్రధాని మోదీ ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసితో సమావేశమయ్యారు, ఈ సందర్భంగా వారు ద్వైపాక్షిక సంబంధాలు పెంచే ఒప్పందంపై సంతకం చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, పునరుత్పాదక ఇంధనం, సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలతో సహా ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పెంచే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు.

ఈజిప్టులోని అల్ హకీమ్ మసీదును సందర్శించిన ప్రధాని మోదీ

కైరోలోని గిజా పిరమిడ్లను, అల్-హకీమ్ (Al-Hakim Mosque ) మసీదును కూడా ప్రధాని మోదీ సందర్శించారు. అల్-హకీమ్ మసీదును సందర్శించిన తర్వాత, ప్రధాని మోదీ హెలియోపోలిస్ యుద్ధ శ్మశానవాటికకు వెళ్లి మొదటి ప్రపంచ యుద్ధంలో త్యాగం చేసిన భారతీయ సైనికులకు ప్రధాని నివాళులర్పించారు.
అంతకు ముందు శనివారం, కైరోలో ఈజిప్టు ప్రధాని మోస్తఫా మడ్‌బౌలీతో ప్రధాని మోదీ రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. అరబ్ దేశానికి తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈజిప్టులో పలువురు నాయకులను కూడా కలిశారు. ప్రధాని మోదీ జూన్ 24-25 మధ్య ఈజిప్టు పర్యటనలో ఉన్నారు.

ఇక అమరికా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌తో సహా ప్రముఖ అమెరికన్, భారతీయ CEO లను కలిశారు. ఆయన రాకతో వైట్ హౌస్ వద్ద లాంఛనంగా స్వాగతం, గౌరవ వందనం స్వీకరించారు. ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో పాటు ప్రథమ మహిళ జిల్ బిడెన్ వైట్ హౌస్‌లో ఆతిథ్యం ఇచ్చారు. అలాగే అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్, యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌లు లంచ్ చేశారు.

జూన్ 22న, యుఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో రెండుసార్లు ప్రసంగించిన మొదటి భారతీయ నేతగా ప్రధాని మోదీ నిలిచారు. 2016లో US కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ఆయన మొదటి ప్రసంగం చేశారు.


Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,

టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *