Friday, March 14Thank you for visiting

Pawan Kalyan | హైదరాబాద్‌లో పుట్టి ఆంధ్రాలో పెరిగి.. కింగ్ మేకర్ గా జనసేన పార్టీ ప్రస్థానం..

Spread the love

Pawan Kalyan Jana Sena Party Formation Day | జనసేన పార్టీ పుట్టి పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆవిర్భావ సభ (Jana Sena Party Formation Day)ను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిపించి, అసెంబ్లీకి పంపించిన పిఠాపురం నియోజకవర్గంలోనే భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. 2014 మార్చి 14న జనసేన ఆవిర్భవించింది. పదేళ్ల తర్వాత 2024 జూన్ 4న తిరుగులేని విజయాన్ని దక్కించుకుంది. టిడిపి, బిజెపి కూటమిలో భాగంగా జనసేనకు కేటాయించిన 21 ఎమ్మెల్యే స్థానాలతోపాటు రెండు ఎంపీ స్థానాలను గెల్చుకుని ‘100 పర్సెంట్ స్ట్రయిక్ రేట్’ సాధించిన రికార్డు నమోదు చేసింది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన అన్నయ్య మెగాస్టర్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పని చేశారు. అప్పటికే హీరోగా బిజీగా ఉన్న పవన్ కల్యాణ్‌ తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అయితే భారీ అంచనాల మధ్య 2009లో ఎన్నికల బరిలో దిగిన ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 స్థానాలకే పరిమితమైపోయింది. ఆ తర్వాత కాలంలో ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

ఆ తర్వాత పవన్ కల్యాణ్ కాంగ్రెస్ పార్టీ అవినీతిఅక్రమాలను దీటుగా ఎదుర్కొనేందుకు జనసేన పార్టీ స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. 2014 మార్చి 14న సమైక్య ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ ఆవిర్భవించింది. హైదరాబాద్‌లో మాదాపూర్ వద్ద ఉన్న నోవోటెల్ హోటల్ లో జనసేన పార్టీని, పార్టీ గుర్తు, సిద్ధాంతాలను ప్రకటించారు.

READ MORE  Amaravati Railway line | అమరావతి రైల్వే లైన్‌కు ప‌చ్చ‌జెండా.. కేంద్ర మంత్రివర్గం ఆమోదం

ఆ ఎన్నికలకు Jana Sena దూరం

2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ జనసేన దూరంగా ఉండిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికింది. రెండేళ్ల తర్వాత, బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదనీ, దీనిపై టీడీపీ కూడా స్పందించలేదని ఆరోపిస్తూ మద్దతును ఉపసంహరించుకొన్నారు.

తొలిసారి ఎన్నికల్లో ఘోర పరాభవం

2019లో జరిగిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బీఎస్పీ, వామపక్ష పార్టీలతో పొత్తుపెట్టుకున్నారు. మొత్తం 134 సీట్లతో జనసేన, బీఎస్పీ, వామపక్షాలు ఎన్నికల బరిలో దిగగా ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటు దక్కింది. తూర్పు గోదావరి జల్లా రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆయన కూడా వైసీపీకి మద్దతిచ్చారు. అన్నింటికి మించి ఈ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్లా ఆయన ఓడిపోయారు. పార్టీ అధినేతనే గెలవలేకపోయారంటూ ప్రతిపక్ష పార్టీలు హేళన చేశారు. ఇక జనసేన పార్టీ పని అయిపోయిందని అనుకూన్నారు.

2019 ఎన్నికల్లో జనసేన (Jana Sena Party) ఘోర పరావభవం తర్వాత…ఆ పార్టీ రద్దు చేస్తారేమోనని అందరూ అనుకున్నారు.
అయితే ఆరునెలల్లోనే పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలపై ఆందోళన బాట పట్టారు. ‘ఇసుక సంక్షోభం’ పై పవన్ కళ్యాణ్ కూలీలకు బాసటా విశాఖలో భారీ ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలకు ఇప్పటి ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. .పవన్ కల్యాణ్‌కు మద్దతు తెలిపారు. ఈ ఉద్యమం ప్రభుత్వంపై కాస్త ఇబ్బంది పెంచింది. అక్కడి నుంచి పవన్ కల్యాణ్ వెనుదిరగలేదు.. రైతులు, మహిళలు, భూ ఆక్రమణలు ఉద్దానం కిడ్నీ బాధితులు వంటి అంశాలపై క్షేత్రస్థాయి పర్యటనలు, సభలు, సమావేశాలు, బాధితులతో నేరుగా ముఖాముఖి వంటి కార్యక్రమాలతో పవన్ కల్యాణ్ జనంతో మమేకమయ్యారు.

READ MORE  IRCTC Shirdi Tour | విజయవాడ నుంచి షిర్డీ టూర్.. తక్కువ ధరలోనే 4 రోజుల ప్యాకేజీ, బుకింగ్ చేసుకోండి ఇలా..
Jana Sena Party
Jana Sena Party

Pawan Kalyan : ఎరుపు నుంచి కాషాయానికి

ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో ఉన్న పవన్ కల్యాణ్… మళ్లీ బీజేపీ పార్టీ వైపు వచ్చారు. రావడమే కాకుండా క్రమంగా సనాతన ధర్మానికి రక్షణ కల్పించాలని ప్రకటించారు. జనం కూడా ముఖ్యంగా యువత ఆయనకు ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలోనే పవన్ సనాతన ధర్మ రక్షణకు బ్రాండ్ అంబాసిడర్‌గా ముద్ర వేశారు. మొదట చే గువేరాను స్ఫూర్తిగా తీసుకున్నపవన్ కల్యాణ్ 2024 నాటికి సనాతన ధర్మం వైపు మారారు.

Jana Sena పార్టీకి కీలక ఘట్టం

బీజేపీతో పొత్తులో ఉన్న పవన్…రాష్ట్రంలో టీడీపీకి మద్ధతు తెలుపుతున్నట్లు ప్రకటించడం జనసేన పార్టీలోకీలక ఘట్టంగా చెప్పవచ్చు. 2023 సెప్టెంబరులో స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు (N.Chandrababu Naidu)ను వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసినపుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. చంద్రబాబుని రాజమండ్రి జైలుకు వెళ్లి పరామర్శించారు. ఇదే జనసేనకు, టీడీపీకి 2024 ఎన్నికల్లో బూస్టులా పని చేసింది.

అప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్… 2024 ఎన్నికల్లో టీడీపీతో తాను కలిసి వెళ్తున్నానని షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. వైఎస్ ఆర్ సిపి (YCP) అరాచకాలను అడ్డుకునేందుకే టిడిపితో కలిసి వెళ్తున్నామని రాజమండ్రి జైలు వద్ద జరిగిన మీడియా సమావేశంలో పవన్ ప్రకటించారు. ఈ విషయంలో బీజేపీని ఒప్పించారు. పవన్ కల్యాణ్ తనకు ఒక అన్నలా నిలబడ్డారంటూ నారా లోకేశ్ సైతం వ్యాఖ్యానించడం రెండు పార్టీలకు బలాన్నిచ్చింది. .

READ MORE  AP Yuva Nestham | వెంటనే ఇవన్నీ రెడీ చేసుకోండి , ఏపీ లో నిరుద్యోగ భృతి.

అనంతరం 2024 పొత్తుల్లో భాగంగా జనసేన (Jana Sena), టీడీపీ(TDP), బీజేపీ (BJP) కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో నిలిచారు. ప్రచారంలోనూ మూడు పార్టీలో ఏకమై ప్రజలకు దగ్గరయ్యారు. అయితే 175 కు 175 సీట్లు గెలుస్తామని ప్రకటించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పోటీ చేసి 70వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు, గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

Pawan Kalyan : పవన్ కాదు.. తుఫాన్..

2024 ఎన్నికల్లో జనసేన 21 స్థానాలకు 21 స్థానాలు గెలిచి తిరుగులేని రికార్డు సృష్టించింది జనసేన పార్టీ. ఈ గెలుపును చూసి ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) సైతం ఆశ్చర్యపోయారు.. సీనియర్ రాజకీయ వేత్తలు పాల్గొన్న సమావేశంలో పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan)ను ‘ పవన్ కాదు.. తుఫాన్’ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?