తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి.. వచ్చే నెలలోనే నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు
panchayat elections 2024 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ ముగిసింది. ఆ హడావిడి నుంచి తేరుకోకముందే గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న సర్పంచుల పదవీకాలం వచ్చే సంవత్సరం జనవరి నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ లోపే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది.. 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాజాగా వెల్లడించింది. ఇందులో భాగంగా సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలు పంపించాలని అధికారులను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్ల వివరాలను గ్రామ కార్యదర్శులు ఎలక్షన్ కమిషన్ కు చేరవేశారు.దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను సైతం ప్రారంభించింది.
న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి
కాగా తెలంగాణలో మొత్తం 12 వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. లక్షా 13 వేలకుపైగా వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆర్టికల్ 243E (3)(a) ప్రకారం గ్రామ పంచాయతీల పదవీ కాలం ఐదు సంవత్సరాలు కాగా.. ఆ గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ జీపీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది.
panchayat elections 2024 ముఖ్యాంశాలు:
- కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 13 వేలకు పైగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
- ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరుగుతాయి.
- పంచాయతీ ఎన్నికల సందర్భంగా బ్యాలెట్ పత్రాల్లో నోటా గుర్తు కూడా ఉంటుంది.
- ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉండనుంది.
- ఉప సర్పంచ్‌ను చేతులు ఎత్తడం ద్వారా పాతపద్ధతిలోనే ఎన్నుకుంటారు. ఏదైనా కారణంతో ఉపసర్పంచ్ ఎన్నిక అదేరోజు వీలు కాకపోతే, మరుసటి రోజు నిర్వహిస్తారు.
- 2019 జనవరి 21, 25, 30వ తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. నాడు కొత్త సంవత్సరం తొలి రోజునే ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగా ఈసారి డిసెంబర్ చివరి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో జాయిన్ కండి.