Panchangam 2024 | ఈ వారం 12 రాశులవారికి ఏయే ఫలితాలు ఉంటాయి?

Panchangam 2024 |  ఈ వారం 12 రాశులవారికి ఏయే ఫలితాలు ఉంటాయి?

Rashi Phalalu| ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 జూన్ 23 ఆదివారం నుంచి జూన్  29 శనివారం వరకు ఈ వారం రోజుల్లో  రాశిఫలాలు (Astrology Signs ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు

మేష రాశి (Aries)

మేష రాశి వారికి ఈ వారం (23’rd June – 29’th June) లో Transco ఉద్యోగస్తులకు వృత్తిపరమైన చికాకులు మరియు అవమానములు కలుగును. దైవారాధనలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. అతి మంచితనం సరికాదు అని అర్థమవుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా ఆనందంగా కాలాన్ని గడుపుతారు. స్థిరత్వంతో నిర్ణయాలు తీసుకోవడం వలన విజయాలు సాధిస్తారు. వ్యాపార భాగస్వామితో ఉన్న తగాదాలు తొలగుతాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. అప్పు కొంతమేర తీర్చగలుగుతారు. నూతన వాహన ప్రాప్తి కలదు. Mobile phones & Home Needs కి సంబంధించిన వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి. మీ పుత్ర సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. Chit Fund వ్యాపారస్తులకు చట్టపరమైన సమస్యలు వచ్చును. భద్రకాళి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

వృషభ రాశి (Taurus)

వృషభ రాశి వారికి ఈ వారంలో ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు తమ ఎంచుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలుగుతారు. అజీర్ణంతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. స్త్రీలు అందం మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూస్తారు. మీ జీవిత భాగస్వామితో ఉన్న అభిప్రాయ బేధాలు తొలుగుతాయి. Software ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. నూతన ఆదాయ మార్గాలను అన్వేషించాలి. Eye Sight పెరుగుతుంది. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి వీసా మంజూరు అవుతుంది. కుటుంబ సభ్యులతో తగాదానికి దిగడం అంత మంచిది కాదు. Food Business లో ఉన్నవారికి సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. సంతాన భవిష్యత్తుకై ప్రణాళికను సిద్ధం చేయాలి. ఆర్థికపరమైన వెసులుబాటు ఉంటుంది. Real Estate వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండను. మధ్యవర్తిత్వము వల్ల లాభపడతారు. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

మిధున రాశి (Gemini)

మిధున రాశి వారికి ఈ వారంలో శుభకార్యము నిర్వహించే అవకాశం కలదు. నూతన వాహన కొనుగోలు చేసే అవకాశం కలదు. విద్యార్థులు పోటీ పరీక్షలు యందు విజయాలు సాధిస్తారు. అధికమైన ధన వ్యయము చేయవలసి వస్తుంది. Book Stall వ్యాపారస్తులు మంచి లాభాలను పొందగలుగుతారు. మీరు ఇతరుల మీద చూపించే ఆరాటం వలన నష్టపోయే అవకాశం కలదు. Bank Loans ఆలస్యం అవుతాయి. ప్రతి చిన్న విషయంలోనూ మొండితనం అంత మంచిది కాదు. శరీరానికి గాయాలయ్యే అవకాశం కలదు. కుటుంబ సభ్యులతో యాత్రలు చేసే అవకాశం కలదు. తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. పిల్లల విషయంలో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. విలువైన వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి. పోలీస్ శాఖ వారికి పదోన్నతులు ఉండను. బంగారం వ్యాపారం చేసే వారికి Income Tax నోటీసులు అందుకునే అవకాశం కలదు. గణపతి ఆరాధన చేయడం చెప్పదని సూచన.

READ MORE  ఈ వారం రాశి ఫలాలు.. నవంబర్ 5 నుంచి 11వరకు..

కర్కాటక రాశి  (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ వారంలో తండ్రి నిర్ణయాలతో ఏకీభవిస్తారు. రెండు రకాల ధనార్జన ఉంటుంది. మంచి మనసుతో ఇతరులకు సహాయం చేస్తారు. పోలీసు శాఖ ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఇబ్బందులు ఉండును. మీ జీవిత భాగస్వామితో ఉన్న తగాదాలు తొలుగుతాయి. తరచూ మీ అభిప్రాయాలను మార్చుకోవడం వలన ఇతరులు మిమ్మల్ని ద్వేషించే అవకాశం కలదు. ధనాన్ని పొదుపు చేసుకోవలసిందిగా చెప్పదగిన సూచన. రాజకీయరంగంలో ఉన్నవారికి Court Notice లు అందుకోవాల్సి వస్తుంది. చెడు స్నేహములకు దూరంగా ఉండండి. Schools నడిపే వారికి అన్ని విధాల అదృష్టం తోడవుతుంది. ఈ రాశి స్త్రీలకు గర్భ సంబంధిత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు. విద్యార్థులకు యోగ కాలము. సంతాన ఎదుగుదలను చూసి ఆనందిస్తారు. Hardware & Paints వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. నడుము నొప్పితో ఇబ్బంది పడతారు. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

సింహ రాశి  (Leo)

సింహ రాశి వారికి ఈ వారంలో తల్లితో కలహం ఏర్పడే అవకాశాలు కలవు. తండ్రి నుంచి వచ్చే ఆస్తి చేతికి అందుతుంది. వృత్తిపరమైన ఎదుగుదల మానసిక ప్రశాంతతకు కారణమవుతాయి. విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. జ్యేష్ఠ సంతానము ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. మఖ నక్షత్ర జాతకులు చర్మవ్యాధులతో ఇబ్బంది పడతారు. Food Agency వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉండును. పోలీస్ శాఖ వారికి పదోన్నతులు ఉండును. Bank loans మంజూరవుతాయి. విలాసం కొరకు అధిక ఖర్చులు చేయకూడదు. ముఖ్యమైన పనులు వాయిదా వేయకూడదు. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. నూతన గృహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కళా రంగంలో ఉన్నవారికి యోగ కాలము. మతిమరుపు ఒక సమస్యగా మారుతుంది. ప్రభుత్వ Permissions మంజూరు అవుతాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారు శుభవార్త వింటారు. ఈశ్వర ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

కన్య రాశి (Virgo)

కన్య రాశి వారికి ఈ వారంలో ఏ నిర్ణయమైనా మీ జీవిత భాగస్వామితో చర్చించి తీసుకుంటారు. పంటి నొప్పితో ఇబ్బంది పడే అవకాశం కలదు. తండ్రి చేసే వృత్తి వ్యాపారాలు చేసే వారికి యోగ కాలము. అనవసరమైన విషయాలలో తల దూర్చకూడదు. వ్యాపార భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడతాయి. విద్యార్థులు శ్రమ చేయవలసిన సమయం. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ వైద్య వృత్తిలో ఉన్నవారికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజలల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది. మధ్యవర్తిత్వాల వల్ల లాభం చేకూరుతుంది. వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వాత సంబంధిత ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. కొడుకు యొక్క ప్రవర్తనను చూసి ఆనందిస్తారు. oil వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. దుర్గ అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదని సూచన.

READ MORE  Astrology Signs | ఈ వారం రాశిఫలాలు..12 రాశులకు ఎలా ఉన్నదంటే?

తూల రాశి (Libra)

తూల రాశి వారికి ఈ వారంలో విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. Bank Loans మంజూరు అవుతాయి. నడుము నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. క్రీడా రంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. Print Media ఉద్యోగస్తులకు వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. మానసిక ఉల్లాసంతో కాలాన్ని కలుపుతారు. నివాస స్థలము మార్పు చేసే అవకాశం కలదు. తల్లితో కలహం అంత మంచిది కాదు. మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వచ్చును మరియు మీ జీవిత భాగస్వామికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. సంకల్పించిన పనులు ఆలస్యం అవుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన. Court కేసులకు సంబంధించిన పనులు వాయిదా పడతాయి. మధ్యవర్తిత్వం వల్ల లాభపడతారు. ఉన్నదాంట్లో సంతృప్తి చెందుతారు. Sugar వ్యాధితో ఇబ్బంది పడే వారు జాగ్రత్తగా ఉండాలి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

వృశ్చిక రాశి (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఆధ్యాత్మికము మరియు సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. మీ తల్లి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. మీ జీవిత భాగస్వామితో యాత్రలు చేసే అవకాశం కలదు. రాజకీయ రంగంలో ఉన్నవారికి మీ వాక్చాతుర్యముతో ప్రజలను ఆకట్టుకోగలుగుతారు. విలాసవంతంగా కాలాన్ని గడుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలు వాయిదా పడడం వల్ల మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ప్రభుత్వ వైద్య వృత్తిలో ఉన్న వారికి ఇబ్బందులు ఉండును. Iron & Cement వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. తండ్రి నిర్ణయాలతో ఏకీభవించవలసి వస్తుంది. కొన్ని సందర్భాలలో ధైర్యాన్ని కోల్పోతారు. సమయస్ఫూర్తితో పనులను పూర్తి చేస్తారు. మీ కష్టానికి అదృష్టం కూడా తోడుఅవుతుంది. కండరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉండును. Chit fund వ్యాపారస్తులకు నష్టములు ఉండును. చండి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

ధనస్సు రాశి (Scorpio)

ధనస్సు రాశి వారికి ఈ వారంలో నూతన వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ సంతానం తెలివి తేటలు చూసి ఆశ్చర్యపోతారు. నరాల బలహీనత వ్యాధితో ఇబ్బంది పడేవారు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకునే విషయంలో confusionకి గురవుతారు. రాజకీయరంగంలో ఉన్నవారు శత్రువుల వ్యూహాన్ని ముందుగానే పసిగడతారు. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. కళా రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. Real Estate వ్యాపారస్తులకు మంచి ఆదాయము ఉంటుంది. మీ జీవిత భాగస్వామి వృత్తి విషయంలో అభివృద్ధి ఉంటుంది. నూతన దంపతులు మనస్పర్ధలకు దూరంగా ఉండాలి. మీ ఆలోచన విధానము మరియు ప్రవర్తన ఇతరుల మనసును నొప్పిస్తుంది. వృత్తిపరమైన పనులు ఆలస్యం అవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. Bar & Restaurant వ్యాపారస్తులకు యోగ కాలము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

మకర రాశి  (Capricorn)

మకర రాశి వారికి ఈ వారంలో సోదరీ సోదరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. తల్లి సౌఖ్యము ఉంటుంది. స్త్రీలు బంగారం కొనుగోలు చేస్తారు. సంతాన అభివృద్ధి కోసం పాటుపడతారు. విద్యార్థుల శ్రమ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో సఖ్యత బలపడుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. Viral fever వచ్చే అవకాశాలు కలవు. జ్యోతిష రంగంలో ఉన్న వారికి పురోగతి ఉంటుంది. శరీరం బరువు పెరగడం ఒక సమస్యగా మారుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారు శుభవార్త వింటారు. తండ్రికి ఎముకలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు. వృత్తిపరమైన విషయాలలో అశ్రద్ధ చేయకూడదు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. oil వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉండును. భూమికి సంబంధించిన సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  kanpur viral video: చోరీ చేసిన డబ్బును చూపిస్తూ దొంగల ఇన్‌స్టాగ్రామ్ రీల్‌.. ఆటకట్టించిన పోలీసులు

కుంభ రాశి (Aquarius)

కుంభ రాశి వారికి ఈ వారంలో కుటుంబ పరమైన సౌఖ్యం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. సోదరీ సోదరులతో తగాదాలు ఏర్పడతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలు యందు విజయాలు సాధిస్తారు. నూతన వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు సంబంధించిన విషయాలలో ఆచితూచి అడుగులు వెయ్యాలి. మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి పదోన్నతులు ఉండును. Medical shops నడిపే వారికి సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. భూమికి సంబంధించిన సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండును. వృత్తిపరమైన ఎదుగుదల కోసం శ్రమించాలి. పాల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. Banking sector ఉద్యోగస్థులకు పనిభారం అధికం అవుతుంది. ఇతరుల మీద పెత్తనము చేయడం అంత మంచిది కాదు. ఈశ్వర ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

మీన రాశి  (Pisces Zodiac)

మీన రాశి వారికి ఈ వారం ( 23’rd June – 29’th June ) లో పెద్దరికము మరియు మంచి మనసుతో తప్పు చేసిన వారిని కూడా క్షమిస్తారు. నూతన అప్పు కొంతమేర తీర్చగలుగుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సరదాగా ఆనందంగా కాలాన్ని గడుపుతారు. కుటుంబ పరమైన కలహాలకు దూరంగా ఉండాలి. విదేశీయాన ప్రయత్నాలు చేసే విద్యార్థులకు వీసా మంజూరు అవుతుంది. ఆస్తి విషయమై సోదరీ సోదరులతో చర్చలు కొలిక్కి వస్తాయి. మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. శరీరంలో వేడి పెరగడం వలన ఇబ్బంది పడతారు. వాహనలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. Home Needs వ్యాపారస్తులకు కొంత ఇబ్బందులు ఉండును. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. కళా రంగంలో ఉన్నవారికి ధనపరమైన ఇబ్బందులు ఉండును. Rice Mill వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది. దుర్గా అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

 

Astrology Signs  By

స్వర్ణకంకణధారి, జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక

డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ

7730023250, 8978510978


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *