Saturday, August 30Thank you for visiting

Chikkamagaluru | కర్ణాటకలో పాలస్తీనా జెండాలతో హల్‌చల్

Spread the love

Chikkamagaluru : కర్ణాటకలో నలుగురు మైనర్లు పాలస్తీనా జెండా (Palestinian Flag ) లతో వాహనాలపై ర్యాలీలు చేస్తూ హల్‌చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిక్కమగళూరు జిల్లాలో ద్విచక్ర వాహనాలపై నలుగురు మైనర్లు పాలస్తీనా జెండాను ఎగురవేశారు. వీడియో సోషల్ మీడియాలో రావడంతో పోలీసులు రంగంలోకి దిగి  నలుగురు మైనర్లను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మైనర్‌ల చేతికి జెండా ఎలా వచ్చింది? వారు స్వయంగా చేశారా లేదా ఎవరైనా  అలా చేయమని ప్రోత్సహించారానే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

ద్విచక్రవాహనంపై   వెనుక కూర్చున్న వ్యక్తి  పాలస్తీనా జెండా పట్టుకుని కనిపించడంతో స్థానిక హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. భజరంగ్‌దళ్‌, భాజపా కార్యకర్తలు టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈద్ మిలాద్ సందర్భంగా దేశ వ్యతిరేక భావాలు కలిగిన యువకులు పాలస్తీనా జెండా పట్టుకుని ర్యాలీ నిర్వహించారని, యువకులను వెంటనే అరెస్టు చేయాలని బిజేపీ సీనియర్ నేత ఆర్.అశోక,   బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు సంతోష్ కొటియన్ డిామాండ్ చేశారు.

“నాగమంగళలో మతపరమైన అశాంతి ఉంది, ప్రజలు ఆందోళన చెందుతున్నారు, రేపు ఈద్ మిలాద్, మరోవైపు గణేష్ శోభాయాత్రలు ఉన్నాయి.  ఇటువంటి క్లిష్ట సమయంలో, కొందరు వ్యక్తులు అలజడులను  సృష్టించేందుకు “పాలస్తీనా జెండాలను పట్టుకుంటున్నారని ఆరోపించారు.  దీంతో అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకొని నిందితులను గుర్తించి అరెస్టుచేశారు. ఇందులో తెరవెనుక ప్రమేయం ఉన్నవారిని ధృవీకరించలేదు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు. మొత్తం ఐదుగురు వ్యక్తులు ఇందులో ఉన్నారని, కొందరు వేర్వేరు బైక్‌లను నడుపుతున్నారని తెలుస్తోంది.

మిగతా నిందితుల ఆచూకీ కోసం బృందాలను ఏర్పాటు చేశామని, ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను గుర్తించామని జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ జి.కృష్ణమూర్తి ధృవీకరించారు. ఇదిలా ఉండగా ఆగస్టు 15న కర్ణాటకలోని కుణిగల్ పట్టణంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో పాలస్తీనా జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. కుణిగల్ తాలూకా పరిపాలన ఆధ్వర్యంలో జరిగిన జెండా ఎగురవేత కార్యక్రమంలో కుణిగల్ ఎమ్మెల్యే డాక్టర్ రంగనాథ్, ఇతర తాలూకా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో, ఐదారుగురు వ్యక్తులు వేదిక వెనుక పాలస్తీనా జెండాను ఎగురవేయడానికి ప్రయత్నించారు. కొందరు యువకులు నిలదీయడంతో వారు పారిపోయారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.
Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *