Liquor Prices in India : ప్రభుత్వాలకు అతి ప్రధానమైన ఆదాయ వనరు మద్యమే.. మద్యం ప్రియుల పుణ్యమాని ప్రభుత్వాలకు భారీగా ఆదాయం సమకూరుతోంది. దేశంలో అత్యధిక మంది మద్యం తాగే రాష్ట్రంగా మన తెలంగాణ గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ మద్యం ధరలు ఎంత పెంచినా కూడా తాగడం ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా డిసెంబర్ నుంచి నూతన మద్యం పాలసీ అమలుల్లోకి రానుంది. ఎన్నికలు సమీపిస్తున్నందున ఇప్పట్లో ధరలు పెరిగే అవకాశం లేదు. అయితే.. ఎన్నికల తర్వాత పెరగొచ్చని తెలుస్తోంది. ఆంధ్రాలోనూ మద్యం ధరలు భారీగానే ఉన్నాయి. తెలంగాణ ధరలకన్నా ఎక్కువగా ఉండడంతో సరిహద్దు జిల్లాల వారు తెలంగాణ నుంచే మద్యం తీసుకెళుతున్నారు. దేశంలో మద్యం ధరలు ఎక్కడ తక్కువ ఉంటాయో మీకు తెలుసా… అత్యధిక ధరలు ఎక్కడ ఎందుకీ వ్యత్యాసం అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మనదేశంలో Goa పర్యాటకానికి స్వర్గదామం… ఆహ్లాకరమైన సముద్ర తీరం, బీచ్‌లకు మొదటగా గుర్తుకొచ్చేది గోవానే.. అయితే మరో విషయంలో అతి తక్కువ పన్నుల కారణంగా లిక్కర్ కూడా ఇక్కడ చాలా ఫేమస్.. కానీ దీని పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో మత్రం పూర్తి విరుద్ధం. ఎందుకంటే… భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో కెల్లా మద్యంపై అత్యధికంగా పన్ను ఇక్కడే విధిస్తున్నారు. అందుకే కర్ణాటకలో లిక్కర్ చాలా ఖరీదు..
ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన అధ్యయనం ప్రకారం.. అత్యధిక మద్యం ధరలు(Liquor Rates) కలిగిన రాష్ట్రాల జాబితాలో కర్ణాటక దేశంలోనే అగ్రస్థానంలో ఉండగా, గోవా అట్టడుగున ఉంది.
విశ్లేషణ ప్రకారం, కర్ణాటక మద్యం గరిష్ట రిటైల్ ధర (MRP)పై 83 శాతం పన్ను విధిస్తుంది. కానీ గోవా రాష్ట్రం మద్యంపై MRPపై 49 శాతం పన్ను మాత్రమే విధిస్తోంది.
71 శాతం పన్నుతో రెండో స్థానంలో మహారాష్ట్ర, 68 శాతం పన్నుతో మూడో స్థానంలో తెలంగాణ నిలిచింది. మద్యం MRPలో 69 శాతం రాజస్థాన్ పన్ను విధించింది. అంటే గోవాలో రూ.100 ఉన్న విస్కీ, రమ్, వోడ్కా లేదా జిన్ బాటిల్ ధర కర్ణాటకలో రూ. 513 ఉండగా, ఢిల్లీలో రూ.134, తెలంగాణలో రూ.246గా ఉంటుంది.
భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో మద్యం ధరలు:
[table id=13 /]
స్థానిక పన్నుల వ్యత్యాసాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఢిల్లీ, ముంబైలలో ప్రసిద్ధ స్కాచ్ బ్రాండ్‌ల బాటిల్ ధరలో భారీ తేడా ఉండవచ్చు. ఉదాహరణకు, బ్లాక్ లేబుల్ బాటిల్ ఢిల్లీలో దాదాపు రూ.3,100 ఉంటే, ముంబైలో దాదాపు రూ.4,000కి విక్రయిస్తారు. ముఖ్యంగా, మద్యం ధరలలో ఈ భారీ వ్యత్యాసం కారణంగా రాష్ట్ర సరిహద్దుల గుండా మద్యం అక్రమ రవాణా చేస్తున్నారు.
జీఎస్టీ పరిధిలో లేకపోడంతో.
జీఎస్టీ అనేది దేశంలో ప్రాంతాల్లో అన్ని వస్తువులు, సేవలపై ఒకే పన్ను రేటు ఉండేలా చేసే వ్యవస్థ. అయితే ప్రస్తుతం జీఎస్టీ పరిధిలో మద్యం, పెట్రోలియం లేకపోవడం వల్ల వివిధ రాష్ట్రాల్లో వారి ఇష్టానుసారంగా వేర్వేరు పన్నులు విధిస్తున్నారు. దీంతో మద్యం, పెట్రోలు కొనుగోలు చేసే, విక్రయించే ఆయా ప్రాంతాల్లో అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం మద్యం, పెట్రోల్‌ను జీఎస్టీలో చేర్చాలని సూచించింది. ఇది పన్ను రేట్లు ఒకేలా మార్చడంతోపాటు అక్రమ రవాణాను నిరోధిస్తుంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.