వైద్య పరీక్షల కోసం ఎండలో 7 కి.మీ నడిచి వెళ్లిన గర్భిణి.. వడదెబ్బతో మృతి
భానుడి భగభగలు దేశ వ్యాప్తంగా అమాంతం పెరిగిపోయాయి. ఉదయం 9 దాటిందంటే చాలు బయట కాలు పెట్టలేని పరిస్థితి. తాజాగా ఓ గర్భిణి ఎండలో ఏకంగా 7 కిలోమీటర్లు నడిచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తుండగా వడదెబ్బకు గురై మరణించింది. ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్రలో మే 15న సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లోని ఓసర్ వీరా గ్రామానికి చెందిన సోనాలి వాఘాట్( 21) అనే గర్భిణి జనరల్ చెకప్కోసం దండల్వాడి పీహెచ్‌సీకి…