ola electric s1 కొత్త వేరియంట్‌

ola electric s1 కొత్త వేరియంట్‌
Spread the love

ధర రూ. 99,999

ప్ర‌ముఖ ఈవీ త‌యారీ సంస్థ Ola Electric భారతీయ మార్కెట్లో S1 ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించి కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఇది ఎంట్రీ-లెవల్ S1 2kWh బ్యాటరీ ప్యాక్‌ను క‌లిగి ఉంటుంది. ఇండియాలో దీని ధర రూ. 99,999. గానిర్ణ‌యిచారు. ఇది 8.5 kW మోటారును కలిగి ఉంది, ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే 91 కి.మీ వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. కొత్త Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 90 kmph వేగంతో దూసుకెళ్తుంది. దీని బ్యాటరీ ప్యాక్ హోమ్ ఛార్జర్ ద్వారా 4 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది.

11 రంగుల్లో అందుబాటులో..

ola electric s1 కొత్త వేరియంట్ మొత్తం 11 రంగుల ప్యాలెట్‌లలో అందుబాటులో ఉంటుంది. గెరువా, మాట్ బ్లాక్, కోరల్ గ్లామ్, మిలీనియల్ పింక్, పింగాణీ వైట్, మిడ్‌నైట్ బ్లూ, జెట్ బ్లాక్, మార్ష్‌మెల్లో, ఆంత్రాసైట్ గ్రే, లిక్విడ్ సిల్వర్ నియో మింట్. S1 ప్రో, S1 వేరియంట్ల‌తో పోలిస్తే S1 పోర్ట్‌ఫోలియోలో 115 కిలోల కర్బ్ వెయిట్‌తో ఉండ‌డంతో ఇది కాస్త తేలిక బ‌రువుతో ఉంటుంది.
Ola వ్యవస్థాపకుడు/ CEO భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ “భారతీయ వినియోగదారుల కోసం ICE వాహనాలకు ప్రపంచ స్థాయి ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత EVలకు ఎంతో డిమాండ్ పెరిగింది. ప్రీమియం స్కూటర్ విభాగంలో Ola S1, Ola S1 ప్రో ఆధిపత్యంతో భారతదేశం ఇప్పటికే ప్రపంచంలోని అతిపెద్ద EV మార్కెట్‌లలో ఒకటిగా నిలిచింది. విజయవంతమైన S1 పోర్ట్‌ఫోలియోలో S1 ఎయిర్ 3 కొత్త వేరియంట్‌లలో ఎక్కువ మంది కస్టమర్‌లు EVలకు మారుతారు అని తెలిపారు. 2023 భారతదేశంలో 2W పరిశ్రమ గమనాన్ని మారుస్తుద‌ని పేర్కొన్నారు.

READ MORE  Maruti Suzuki Dzire | చరిత్ర సృష్టించిన మారుతి సుజుకీ.. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన డిజైర్..

మార్చి 2023 నుండి డెలివరీలు ప్రారంభం కానుండగా, కొత్త వేరియంట్ కోసం ఆన్‌లైన్ కొనుగోళ్లను ప్రారంభించారు. కాగా Ola Electric గత నెలలో 25,000 యూనిట్ల సేల్స్ మైలురాయిని అధిగమించింది, ఇది త‌మ అత్యుత్తమ నెలవారీ పనితీరును క‌న‌బ‌రిచింద‌ని కంపెనీ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *