యుద్ధప్రాతిపదికన రైల్వే పునరుద్ధరణ పనులు
odisha train accident : ఒడిశా రైలు ప్రమాద స్థలంలో పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ ప్రక్రియను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని రైల్వే మంత్రిత్వ శాఖ తన ట్వీట్‌లో పేర్కొంది. ఏడు కంటే ఎక్కువ పొక్లెయిన్ మెషీన్లు, రెండు ప్రమాద సహాయ రైళ్లు, 3-4 రైల్వే, రోడ్ క్రేన్‌లను ముందస్తుగా పునరుద్ధరణ కోసం మోహరించినట్లు రైల్వే తెలిపింది. అంతకుముందు, శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాద స్థలానికి సందర్శించి మృతుల కుటుంబ సభ్యులు, క్షతగాత్రులతో మాట్లాడారు. బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రధాని వెంట కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లు కూడా ఉన్నారు.
“ఇది బాధాకరమైన సంఘటన. మేము కోల్పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేము, కానీ ఈ దుఃఖ సమయంలో మేము బాధిత కుటుంబాల వెంటే ఉన్నాము. ఈ సంఘటనను ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించింది. గాయపడిన ప్రయాణికులకు చికిత్స చేయడంలో ఎటువంటి జాప్యం చేయబోమని తెలిపారు. ఈప్రమాద ఘటనలో దోషులుగా తేలిన వారిని విడిచిపెట్టరు,” అని పీఎం మోడీ అన్నారు. కాగా రెస్క్యూ ఆపరేషన్స్‌లో సహాయం కోసం స్థానికులు చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రశంసించారు.
మరోవైపు సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని ఖరగ్‌పూర్ డివిజన్‌లోని హౌరా-చెన్నై ప్రధాన మార్గంలో జరిగిన ఈ ప్రమాదం కారణంగా 48 రైళ్లు రద్దు చేశారు. 39 రైళ్లను దారి మళ్లించారు. అలాగే 10 రైళ్లు షార్ట్ టర్మినేట్ చేశారు.
Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,
టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి