Odisha CM | ఒడిశాలో బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా మోహన్ చ‌ర‌ణ్‌ మాఝీ ఎవ‌రు..?

Odisha CM | ఒడిశాలో బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా మోహన్ చ‌ర‌ణ్‌ మాఝీ ఎవ‌రు..?

Mohan Charan Majhi :  ఒడిశా నూతన ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఊహాగానాలకు తెరపడింది. సీనియర్ నేత మోహన్ చరణ్ మాఝీ (Mohan Charan Majhi)ని ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్ఠానం మంగళవారం ప్రకటించింది.  కనక్ వర్ధన్ సింగ్ డియో, ప్రవతి పరిదా ఇద్దరు డిప్యూటీ ముఖ్య‌మంత్రులుగా ఉంటారని తెలిపారు. బుధవారం ప్రమాణస్వీకార కార్యక్రమం జ‌రుగుతుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 2000 నుంచి కోస్తా రాష్ట్రంలో అధికారంలో ఉన్న BJDని BJP ఓడించింది, ఆరోసారి ముఖ్య‌మంత్రి ప‌దవి చేప‌ట్టాల‌ని భావించిన‌ నవీన్ పట్నాయక్ ఆశ‌లు ఆడియాస‌ల‌య్యాయి. మోహ‌న్ చ‌ర‌ణ్‌ ఒడిశాలో బిజెపికి మొదటి ముఖ్యమంత్రిగా ప‌ద‌వి చేప‌ట్ట‌నున్నారు. .

మోహన్ చరణ్ మాఝీ ఎవరు?

53 ఏళ్ల మోహ‌న్ చ‌ర‌ణ్ మాఝీ ఒక గిరిజన నాయకుడు. 2000లో తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. మాజీ సర్పంచ్ (గ్రామాధికారి) అయిన మాఝీ, కియోంజర్ అసెంబ్లీ స్థానం నుంచి నాలుగు పర్యాయాలు, 2000, 2004, 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ప్ర‌మాణ‌స్వీకారం పూర్త‌యితే.. అతను ఒడిశాకు 15వ ముఖ్యమంత్రిగా అధికారం చేప‌ట్ట‌నున్నారు. గతంలో మోహ‌న్ చ‌ర‌ణ్ BJD-BJP సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ విప్‌గా పనిచేశారు. 2005 నుండి 2009 వరకు ఇక్కడ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికలలో, మోహన్ చంద్ మాఝీ 11,577 ఓట్ల తేడాతో BJD కి చెందిన‌ మీనా మాఝీని ఓడించారు.

READ MORE  ఐదేళ్లలో వన్యప్రాణుల కారణంగా 2,950 మంది మృతి

ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు 2024

147 స్థానాలున్న ఒడిశా అసెంబ్లీలో బీజేపీ 78 సీట్లు గెలుచుకోగా, బీజేడీ 51 సీట్లకు ప‌రిమిత‌మైంది. మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌ కేవలం 14 నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక్కడ ఏకకాలంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 21 పార్లమెంటరీ సెగ్మెంట్లలో కాషాయ పార్టీ 20 స్థానాలను గెలుచుకోగా, కేవ‌లం ఒక్క సీటు కాంగ్రెస్‌కు దక్కింది.

ఒడిశాలో సీనియర్ నేతలు ధర్మేంద్ర ప్రదాన్‌ , జుయెల్ ఓరం లను పక్కనపెట్టి 52 ఏళ్ల మోహన్ చరణ్ మాఝీని బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా సీఎం పదవి కోసం ఎంపిక చేసింది. ఒడిశాలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో మాఝీ కీలక పాత్ర పోషించారు. ఆదివాసీ ప్రాంతాలలో మాఝీ గట్టి పట్టుంది. 2000, 2009, 209, 2024 ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో నవీన్‌ పట్నాయక్‌ మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం కూడా ఉంది.

READ MORE  PM Modi 3.0 | మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముహూర్తం ఖరారు

కాగా, ఓటమనేదే తెలియని నేతగా గుర్తింపు పొందిన సౌమ్యుడైన నవీన్‌ పట్నాయక్‌కు 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చేదు అనుభవాన్ని మిలిల్చాయి. 25 ఏళ్లలో ఐదు పర్యాయాలు అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ బిజేడీ పార్టీ అనూహ్యంగా పరాజయంపాలయ్యింది. బీజేడీని మట్టికరిపించి ఒడిశాలో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చింది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *