Parliament Session | లోక్ సభ సమావేశాల షెడ్యూల్ ఖారారు..

Parliament Session | లోక్ సభ సమావేశాల షెడ్యూల్ ఖారారు..
Spread the love

Parliament Session |కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత  మోదీ 3.0 కేబినెట్‌లో 71 మంది ఎంపీలకు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో కేంద్రం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలకు (Parliament Session) ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈమేరకు జూన్‌ 24 నుంచి జులై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్‌ రిజుజు ((Parliamentary Affairs Minister Kiren Rijiju) బుధవారం ప్రకటించారు. అయితే లోక్‌సభ (Lok Sabha) కార్యకలాపాలు నిర్వహించేందుకు గాను స్పీకర్‌ ను ఎన్నుకోవాల్సి ఉంది.

18వ లోక్‌సభ మొదటి సెషన్‌  జూన్‌ 24 నుంచి జులై 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు మంత్రి కిరెణ్‌ రిజుజు వెల్లడించారు. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన  సభ్యుల ప్రమాస్వీణంతోపాటు  స్పీకర్‌ ఎన్నిక ఉంటుందని వివరించారు. రాజ్యసభ సెషన్  జూన్‌ 27 నుంచి జూలై 3 వరకు  నిర్కొవహించనున్నట్లు తెలిపారు. జూన్‌ 27 ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఈ ప్రసంగంలో రానున్న ఐదేళ్లలో ప్రభుత్వం చేయబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రధాని మోదీ తన మంత్రి మండలిని పార్లమెంట్‌కు పరిచయం చేయనున్నట్లు మంత్రి కిరెణ్‌ రిజుజు తెలిపారు. అనంతరం రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి మోదీ సమాధానమిస్తారు.

READ MORE  Nitin Gadkari | జాతీయ రహదారులపై మరిన్ని సౌకర్యాలు.. త్వరలో హమ్‌సఫర్‌ పాలసీ

స్పీకర్‌ ఎవరు?

మోదీ 3.0 ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన మిత్ర పక్షాలు టీడీపీ, జేడీయూ లోక్‌సభ స్పీకర్‌ ((Lok Sabha Speaker))  పదవిని ఆశిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్పీకర్ పదవి తమకు ఇవ్వాలని అధికార బీజేపీ మిత్ర పక్షాలైన టీడీపీ, జేడీయూ కోరుతున్నట్లు తెలుస్తోంది.  తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ ఎంపీ పురంధేశ్వరి, టీడీపీ ఎంపీ హరీశ్‌ మాథుర్‌.. అలాగే రాజస్థాన్‌ కోటా నుంచి ఎంపీగా ఎన్నికైన ప్రస్తుత స్పీకర్‌ ఓం బిర్లాకు మరోసారి ఛాన్స్ ఇవ్వనున్నారని పలువురు భావిస్తున్నారు.

READ MORE  10 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 15న ఈ మార్గాల్లో ప్రారంభం

 


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..
 

 

 

READ MORE  ADR Report | లోక్ స‌భ మొద‌టి ద‌శ‌లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల్లో 16% మందిపై క్రిమినల్ కేసులు.. ఇంకా షాకింగ్ వివరాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *