Himanta Biswa Sarma : అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆధార్ కార్డుల (Aadhaar Card)ను పొందడానికి కొత్త దరఖాస్తుదారులందరూ తమ ఎన్‌ఆర్‌సి దరఖాస్తు రసీదు నంబర్ ( NRC Application )ను తప్పనిసరిగా సమర్పించాలని హిమంత బిస్వా శర్మ శనివారం తేల్చి చెప్పారు. విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “ఆధార్ కార్డుల దరఖాస్తులు జనాభా కంటే ఎక్కువగా ఉన్నాయి… ఇది అనుమానాస్పద పౌరులు ఉన్నారని స్పష్టం చేస్తోంది. అందుకే కొత్త దరఖాస్తుదారులు వారి NRC దరఖాస్తు రసీదు సంఖ్య (ARN) సమర్పించాలని మేము నిర్ణయించాము.” అని వెల్లడించారు.
ఇది “అక్రమ విదేశీయుల వలసల ప్రవాహాన్ని అరికడుతుంది” ఆధార్ కార్డుల జారీలో రాష్ట్ర ప్రభుత్వం “చాలా కఠినంగా” ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. అస్సాంలో ఆధార్ పొందడం అంత సులభం కాదు అని శర్మ అన్నారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) ప్రక్రియలో బయోమెట్రిక్ లాక్ చేయబడిన 9.55 లక్షల మందికి ఎన్‌ఆర్‌సి దరఖాస్తు రసీదు నంబర్‌ను సమర్పించడం వర్తించదని తెలిపారు.
గత రెండు నెలల్లో పలువురు బంగ్లాదేశీయులను పట్టుకుని పొరుగు దేశ అధికారులకు అప్పగించిందని, అక్రమ విదేశీయులను గుర్తించే ప్రక్రియను తమ ప్రభుత్వం ముమ్మరం చేస్తుందని హిమంత బిస్వా శర్మ చెప్పారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..