ఢిల్లీలో దారుణం.. వెల్లుల్లి వ్యాపారినికి కొట్టి బట్టలు విప్పి ఊరేగించిన కమీషన్ ఏజెంట్
న్యూఢిల్లీ: నోయిడా(Noida)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కూరగాయల మార్కెట్‌లో కమీషన్ ఏజెంట్ నుంచి అప్పుగా తీసుకున్న రూ.3వేలు చెల్లించకపోవడంతో వెల్లుల్లి వ్యాపారని కొట్టి, బలవంతంగా బట్టలు విప్పి ఊరేగించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో ఏజెంట్‌తో సహా ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం వెల్లుల్లి వ్యాపారి నెల క్రితం కమీషన్ ఏజెంట్ సుందర్ నుంచి రూ. 5,600 మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు. ఆదియాస్ అని పిలిచే ఈ ఏజెంట్లు రైతులకు, కొనుగోలుదారులకు మధ్య మధ్యవర్తులుగా ఉంటారు. మార్కెట్లో క్రయవిక్రయాలపై వీరికి పట్టు ఉంటుంది. అయితే సోమవారం వ్యాపారి రూ.2,500 తిరిగి ఇచ్చాడు. మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు కొంత సమయం అడిగాడు.
దీంతో ఆగ్రహం చెందిన సుందర్.. ఇద్దరు కూలీలకు ఫోన్ చేశాడు. వారు వెల్లుల్లి విక్రేతను ఒక దుకాణంలోకి తీసుకువెళ్లారు, అతన్ని బలవంతంగా బట్టలు విప్పి కర్రలతో కొట్టారు. వెల్లుల్లి వ్యాపారిని హత్య చేస్తామని బెదిరించారు. అంతటితో ఆగకుండా మార్కెట్‌లో నగ్నంగా ఊరేగించారు. షాకింగ్ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. విక్రేత దుర్భాషలాడినట్లు బలవంతంగా బట్టలు వేయడం అంతా వీడియోలో ఉంది. ఈ వీడియోకు సోషల్ మీడియాలో తీవ్ర స్పందన వస్తోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
నిందితులపై కేసు నమోదు
ఈ దారుణ ఘటనకు పాల్పడిన నిందితుపై కేసు నమోదు చేసినట్లు నోయిడా పోలీసు అధికారి డాక్టర్ రాజీవ్ దీక్షిత్ తెలిపారు. కాగా వీడియోను షేర్ చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కమీషన్ ఏజెంట్ సుందర్, మరో నిందితుడు భగందాస్‌ను అరెస్టు చేశామని, మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లోనూ సంప్రదించవచ్చు.