Nitish Kumar NDA Meeting | నేను ఎప్పుడూ ప్రధాని మోడీతోనే ఉంటా : నితీష్ కుమార్
Nitish Kumar NDA Meeting | న్యూఢిల్లీ: ఎన్డీఏ (NDA) పక్షనేతగా ప్రధాని మోదీ పేరును (PM Modi) రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించగా బిహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish kumar) , చంద్రబాబు సహా, మిగతా ఎన్డీఏ పక్ష సభ్యులు నరేంద్ర మోదీని బలపరిచారు. ఈ సందర్భంగా నితీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బిజెపి నేతృత్వంలోని ఎన్‌డీఏ.. కొత్తగా ఎన్నికైన ఎంపిల సమావేశం దిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా నితిష్ కుమార్ మాట్లాడుతూ.. ఇండియా కూటమికి పొరపాటున ఎక్కువ సీట్లు వచ్చాయని, ఈ బృందం “ఏ పని చేయలేదని పేర్కొన్నారు. “నేను అన్ని వేళలా ప్రధానమంత్రితో ఉంటాను” అని కూడా ప్రకటించారు. నితీష్ కుమార్ మోడీకి మద్దతు ప్రకటించడం.. ఒకవైపు ఇండి కూటమి ఆశలకు గండిపడినట్లైంది.
లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇద్దరు కింగ్‌మేకర్లు అవతరించారు. JDU నుండి 12 మంది. చంద్రబాబు నాయుడు TDP నుంచి 16 మంది ఎంపీల మద్దతుతో ఎన్ డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. కాగా బీజేపీకి సొంతంగా 240 సీట్లను గెలుచుకుంది.
బీజేపీ సొంతంగా 272 సీట్లు గెలవదని తేలిన తర్వాత మంగళవారం సాయంత్రం నితీష్ కుమార్ – ఇండియా కూటమి వైపు వెళ్తారనే పుకార్లు సంచలనం రేపాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో సహా ఇండియా కూటమి సీనియర్ నేతలు ఇండియా కూటమిలో చేరాలని నితీష్ కుమార్‌కు సూచించారు. ఎన్డీయే పార్లమెంటరీ సమావేశానికి ఇద్దరు దిల్లీ వెళ్లడంతో చంద్రబాబు నాయుడుపై కూడా ఇలాంటి పుకార్లు వచ్చాయి. అయితే చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేశారు, కానీ నితీష్ కుమార్ మౌనంగా ఉన్నారు. గురువారం నితీష్ కుమార్‌కు సన్నిహిత వర్గాలు ఈ అవకాశాన్ని తోసిపుచ్చాయి.
मोदी जी के नेतृत्व पर नीतीश कुमार ने जताई अपार खुशी…
सुनिए, शपथ ग्रहण को लेकर क्या कहा… pic.twitter.com/m4uxqBApYw
— BJP (@BJP4India) June 7, 2024
నితిష్ కుమార్ మాట్లాడుతూ (Nitish Kumar NDA Meeting). మేం మీతోనే(మోదీ) ఉంటాం. ఇండియా కూటమి నేతలు ఈసారి పొరపాటున విజయం సాధించారు. దేశం కోసం వారేమైనా చేశారా? వారంతా మళ్లీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారు. దేశం ఇకపై పటిష్టమైన ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్తుంది. మోదీ నేతృత్వంలో మేమంతా కలిసి పని చేస్తాం. బిహార్‌లో పెండింగ్ పనులన్నీ పూర్తిచేస్తాము.. ఎన్డీఏ పక్షాలన్ని ఏకతాటిపైకి రావడం ఆనందంగా ఉంది. ప్రధానిగా మోదీ ఆదివారం ప్రమాణస్వీకారం చేస్తారు. కానీ నేను ఈరోజే ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకుంటున్నా.” అని నితీశ్ కుమార్ పేర్కొన్నారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..