
యోగా వారోత్సవాలు ప్రారంభం
International Yoga Day : జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తర్ ప్రదేశ్ లో యోగా వారోత్సవాలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 58,000 గ్రామ పంచాయతీలు, 762 పట్టణ సంస్థలు, జిల్లా ప్రధాన కార్యాలయాల్లో సామూహిక యోగా సాధన నిర్వహించనున్నారు.
దినచర్యగా మారాలి
లక్నో మంచి ఆరోగ్యానికి యోగా కీలకమని, ఇది మనందరికీ నిత్య అలవాటుగా మారాలని నగరంలోని ఇందిరాగాంధీలో గురువారం జరిగిన కార్యక్రమంలో 'యోగ సప్తా' (యోగా వీక్) ప్రారంభ సెషన్‌లో ఆయుష్ మంత్రి దయాశంకర్ మిశ్రా అన్నారు. ప్రతిరోజు యోగా సాధన చేసే వారు అనారోగ్యానికి గురికాకుండా శారీరకంగా, మానసికంగా మెరుగవుతారని తెలిపారు.అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day) పురస్కరించుకుని పాఠశాలలు, కళాశాలల్లో వివిధ పోటీలు నిర్వహించనున్నారు. అమృత్ సరోవర్లు, చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదే...