
ఆలయం లాంటి మసీదు : తాజాగా ప్రార్థనలను నిషేధం విధించిన ప్రభుత్వం
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా ఎరండోల్(Erandol)లోని జుమ్మా మసీదును గత జూలై 14న శుక్రవారం మూసివేశారు. మూడు రోజుల క్రితం, జల్గావ్ జిల్లా(Jalgaon district) కలెక్టర్ అమన్ మిట్టల్ మసీదులోకి ప్రవేశాన్నినిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మసీదును పరిశీలిస్తే అచ్చం పురాత హిందూ దేవాలయంగా కనిపిస్తుంది. మొఘలులు హిందూ దేవాలయాలను ద్వంసం చేసి మసీదులుగా మార్చివేశారనేందానికి ఇది ఒక చిహ్నంగా నిలుస్తుంది.అయితే ఈ మసీదు ఆలయాన్ని తలపిస్తున్నదని ఇది ఎప్పటి నుంచో జైన, హిందూసంఘాల ఆధీనంలో ఉందని, నిర్మాణంపై ఉన్న "ముస్లింల ఆక్రమణలను" తొలగించాలని
పేర్కొంటూ స్థానిక హిందూ సంఘాలు, పాండవ్వాడ సంఘర్ష్ సమితి ఆరు నెలల క్రితం కలెక్టర్‌ను ఆశ్రయించాయి. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఆందోళనకు దిగుతామని
హెచ్చరించారు. దీనిపై స్పందించిన అక్కడి కలెక్టర్ తాజాగా నిషేధం విధించారు. కాగా ఈ మసీదు 13వ శతాబ్దపు ఢిల్లీ సుల్తాను అల్లావుద్...