
కార్మికులకు చేయూతనందించేందుకు మరో కొత్త పథకం: PM Modi
PM Modi : 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ కార్మికుల కోసం సరికొత్త పథకాన్ని ప్రకటించారు. వచ్చే విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆ రోజున దేశంలో ‘విశ్వకర్మ యోజన’ (Vishwakarma Yojana) అనే కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం కింద దేశంలో స్వర్ణకారులు, ఫర్నిచర్ లేదా కలప వస్తువులను తయారు చేసేవారు అంటే వడ్రంగులు, సెలూన్లు నడిపే నాయీ బ్రాహ్మణులు, బూట్లు తయారు చేసేవారు, ఇళ్ళు నిర్మించే మేస్త్రీలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. కార్మికులు ఎవరైనా సరే స్వర్ణకారులు, మేస్త్రీలు, చాకలివారు.. హెయిర్ కట్ కుటుంబాల వారైనా.. అలాంటి వారిని బలోపేతం చేసేందుకు.. ఈ పథకాన్ని తీసుకొస్తున్నారు.‘స్వానిధి యోజన’ కింద దేశంలోని కోట్లాది మంది వీధి వ్యాపారులకు తమ ప్రభుత్వం రూ.50,000 కోట్ల వరకు ఆర్థికసాయం అందించిందని ప్రధాని నరేంద్ర మోడీ (PM M...