Jan Aushadhi | జనరిక్ మందులకు భారీగా డిమాండ్.. రూ.1000 కోట్లమార్కు దాటేసిన విక్రయాలు.
Jan Aushadhi | న్యూఢిల్లీ: దేశంలో జనరిక్ ఔషధాలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. సంప్రదాయ బ్రాండెడ్ మందులతో పోలిస్తే అతితక్కువ ధర కలిగి ఉండడం ఇందుకు ప్రధాన కారణం.. జనరిక్ మందులపై క్రమంగా పేద సామాన్య మధ్యతరగతి ప్రజల్లో నమ్మకం పెరగడంతో వారంతా ఇప్పుడు జనరిక్ మందులనే ఆశ్రయిస్తున్నారు. కాగా జన్ ఔషధి ఔట్‌లెట్ల విక్రయాలు ఈ ఏడాది అక్టోబర్‌లో రూ. 1,000 కోట్ల మార్కుకు చేరుకున్నాయిముఖ్యంగా, ఫార్మాస్యూటికల్స్ & మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (PMBI) సెప్టెంబర్ 2024 ఒక్క నెలలో రూ. 200 కోట్ల విలువైన మందులను విక్రయించింది. గత 10 సంవత్సరాలలో దేశంలో జన్ ఔషధి అవుట్‌లెట్ల సంఖ్య 170 రెట్లు పెరిగింది. 2014లో 80 అవుట్‌లెట్‌లు ఉండగా, ఇప్పుడు దేశంలోని దాదాపు అన్ని జిల్లాలను కవర్ చేస్తూ 14,000 అవుట్‌లెట్‌లకు పైగా విస్తరించాయి."ఈ గణంకాలు.. చవకైన, నాణ్యమైన మందులపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగ...