Posted in

దేశంలో అత్యంత డర్టీగా ఉండే రైళ్లు ఇవేనట..!

Mumbai Train
South Central Railway Updates
Spread the love

ప్రపంచంలో అత్యంత రద్దీ గల ప్రయాణ మార్గాల్లో మొదటిది రైల్వే మార్గం. రైలు మార్గాలు  దేశం లోని నలుమూలలా విస్తరించి ఉన్నాయి. దూర ప్రయాణాలకు ప్రజలు ఎక్కువగా రైళ్లనే ఎంచుకుంటారు. నిత్యం దేశ వ్యాప్తంగా వందలాది ట్రైన్లు ప్రజలకు ఎంతో విలువైన సేవలు అందిస్తున్నాయి. అయితే రైళ్లను ప్రతీరోజు క్లీన్ గా ఉంచేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాకొన్ని ట్రైన్లు మాత్రం చాలా మురికిగా ఉంటున్నాయి. రైలు కోచ్‌ల అపరిశుభ్రతపై ట్విట్టర్‌తో పాటు, రైల్ మదద్ యాప్‌లో ప్రజలు భారతీయ రైల్వేలకు ఫిర్యాదు చేస్తున్నారు. మురికిగా ఉన్న రైళ్లలో దేశ వ్యాప్తంగా 10 ఉన్నాయి. ఈ రైళ్ల గురించి తరచుగా చాలా ఫిర్యాదులు అందుతుంటాయి. ఆ ట్రైన్ల గురించి ఇపుడు తెలుసుకుందాం..

Highlights

రైల్వేలోని అత్యంత మురికిగా ఉన్న రైళ్ల జాబితాలో ‘సహర్స-అమృతసర్ గరీబ్ రథ్’ ట్రైన్ పేరు అగ్ర స్థానంలో ఉంది. ఈ ట్రైన్ పంజాబ్ నుంచి సహర్సా వరకు ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ కోచ్ నుంచి సింక్, టాయిలెట్ సీట్, క్యాబిన్ వరకు అన్ని మురికిగానే కనిపిస్తుంది. సహర్సా-అమృత్‌సర్ గరీబ్ రథ్‌లో ఒక్క డిసెంబర్‌లోనే కనీసం 81 అపరిశుభ్రత ఫిర్యాదులు వచ్చాయి.
దీని తర్వాత, శ్రీ మాతా వైష్ణో దేవి-బాంద్రా స్వరాజ్ ఎక్స్‌ప్రెస్ రైలుపై 64 ఫిర్యాదులు, బాంద్రా-శ్రీ మాతా వైష్ణో దేవి స్వరాజ్ ఎక్స్‌ప్రెస్ రైలుపై 61 ఫిర్యాదులు, ఫిరోజ్‌పూర్-అగర్తలా త్రిపుర సుందరి ఎక్స్‌ప్రెస్ రైలుపై 57 ఫిర్యాదులు అందాయి. ఈ రైళ్లలో పరిశుభ్రత లేకపోవడంతో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.

ఫిరోజ్‌పూర్-అగర్తలా ‘త్రిపుర సుందరి’ ఎక్స్‌ప్రెస్ రైలుతో సహా కొన్ని ఇతర రైళ్ల పేర్లు కూడా
అపరిశుభ్రంగా ఉన్న జాబితాలో ముందువరుసలో ఉన్నాయి. వీటితో పాటు ‘ఆనంద్ విహార్-జోగ్బానీ సీమాంచల్’ ఎక్స్‌ప్రెస్ రైలు, అమృత్‌సర్ క్లోన్ స్పెషల్ రైలు, అజ్మీర్ – జమ్ము తావిపూజ ఎక్స్‌ప్రెస్ రైలు, న్యూఢిల్లీ-దిబ్రూగఢ్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలుపై కూడా అపరిశుభ్రత పై 1000కి పైగా ఫిర్యాదులు అందా యి.. దేశ వ్యాప్తంగా అత్యంత మురికిగా ఉన్న రైళ్ల జాబితా లో మొదటి ఏడు రైళ్లు ఉత్తర భారతదేశంలోనే ఉండడం గమనార్హం. మిగతా రైళ్లు తూర్పు భారతదేశంలో ప్రయాణించే రైళ్లపై ఫిర్యాదులు వచ్చాయి. రైళ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు ఇప్పుడు రైళ్లలో ఆన్‌ బోర్డ్ హౌస్ కీపింగ్ సేవలను కూడా ప్రారంభించినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.


Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,

టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *